Andhra Pradesh: వీడియో ఇదిగో, చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్‌‌పై దాడి చేసిన దుండగులు, పరిస్థితి విషమం

తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చంద్రగిరి భారతీ నగర్‌కు చెందిన సుధాకర్‌ కుప్పం డిపో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్‌‌పై దాడి చేసిన దుండగులు, పరిస్థితి విషమం
Ganja Batch attacked RTC conductor Sudhakar (Photo-Video Grab)

తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చంద్రగిరి భారతీ నగర్‌కు చెందిన సుధాకర్‌ కుప్పం డిపో ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని అర్ధరాత్రి సమయంలో ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు.

ఈ క్రమంలో ఆర్‌ఎఫ్‌ రోడ్డులో వస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సుధాకర్‌పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సుధాకర్‌ తలకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత కూడా అతనిపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. అనంతరం పెన్నుతో తల, మెడపై పొడవడంతో సుధాకర్‌ కేకలు వేశాడు. స్థానికులు అక్కడకు చేరుకోవడంతో దాడికి పాల్పడిన వారు పరారయ్యారు.

వీడియో ఇదిగో, వేగంగా వస్తున్న రైలు కింద పడిన నడి వయస్కుడు, అప్పటికప్పుడు తట్టిన సమయస్ఫూర్తితో పట్టాల మధ్యన పడుకోవడంతో సేఫ్

తీవ్ర రక్తస్రావం కావడంతో సుధాకర్‌ను ముందుగా చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

Ganja Batch attacked RTC conductor Sudhakar

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 24, 2024 02:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).