రైలు వచ్చే ముందు పట్టాలపై పడిపోయిన ఓ నడివయస్కుడు తెలివితో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. చిరకల్-కన్నూరు రైల్వే స్టేషన్ మధ్య పన్నెన్‌పరా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.రైలు వెళుతుండగా ట్రాక్‌పై పడిన వ్యక్తికి రైలు వస్తుందని పక్కనే ఉన్నవారు చెప్పినా వెంటనే లేవలేకపోయాడు. రైలు అతనిపై నుంచి వెళ్లే సమయంలో నడివయస్కుడు సమయస్ఫూర్తితో పట్టాల మధ్యన పడుకుండి పోయాడు.
రైలు వెళ్లిన తరువాత లేచి ట్రాక్ వెంబడి తాఫీగా నడిచినట్లు ఫుటేజీలో స్పష్టంగా ఉంది.అయితే రైలు పట్టాల కింద ఎవరు పడిపోయారనే విషయాన్ని రైల్వే పోలీసులు నిర్ధారించలేకపోయారు. బాధితుడు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు పన్నెన్‌పరాలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Elderly Man Escaping From Train Accident in Kannur
వ్యక్తి పై నుంచి వెళ్లిన రైలు
👉కేరళలోని కన్నూర్‌లో రైలు పట్టాల కింద పడుకుని ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి.
👉ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు రైల్వే పోలీసుల అనుమానం.
👉కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. pic.twitter.com/dfIH5xn7kT
— ChotaNews (@ChotaNewsTelugu) December 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)