Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, కారు కింద చిక్కుకున్న ఆవుదూడ, వాహనాన్ని కదలకుండా రౌండప్ చేసిన ఆవులు, చివరకు ఏమైందంటే..
చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో ఓ వైరల్ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారు కింద ఆవుదూడ చిక్కుకుంది. అది గమనించిన తల్లి ఆవుతో పాటు మరికొన్ని ఆవులు వెళుతున్న కారు వెంట పరిగెత్తి అడ్డగించాయి
చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో ఓ వైరల్ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారు కింద ఆవుదూడ చిక్కుకుంది. అది గమనించిన తల్లి ఆవుతో పాటు మరికొన్ని ఆవులు వెళుతున్న కారు వెంట పరిగెత్తి అడ్డగించాయి. కారు ముందు నిల్చుని అది ముందుకు కదలకుండా అడ్డుకున్నాయి. ఆ తర్వాత అవన్నీ కారు చుట్టూ తిరిగాయి. గమనించిన స్థానికులు ఏదో జరిగిందని ఊహించి అక్కడకు వెళ్లి నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాత కారు కింద దూడ చిక్కుకోవడాన్ని గమనించి కారులో ఉన్న వారిని కిందికి దిగమని కోరారు. ఆ తర్వాత అందరూ కలిసి కారును పైకిలేపి కింద చిక్కుకున్న దూడను రక్షించి బయటకు తీశారు. గాయపడిన దూడ కుంటుకుంటూ బయటకు రావడంతో ఆవులన్నీ కలిసి దానిని తీసుకెళ్లాయి.దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Calf Crushed And Dragged 200 Meters By Car, Cows Chase And Stop the Vehicle In Raigarh
This video is from Raigarh, Chhattisgarh.
When a cow's calf came under the car, the cow came running and stood in front of the car so that the car could not run away.
People rescued the calf and now it is undergoing treatment. pic.twitter.com/LYxK1SqEM9
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 23, 2024 12:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

