హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, వర్కర్లు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు రెస్టారెంట్ యాజమాన్యం సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు ఇంజన్ మంటలు ఆర్పుతున్నారు. ఫైర్ ఇంజిన్ సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు అధికారులు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే రెస్టారెంట్ లో ఉన్న ఫర్నీచర్ చాలా వరకు కాలిపోయిందని హోటల్ యాజమాన్యం తెలిపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణలో మందుబాబులకు షాక్, కింగ్‌ఫిషర్ బీర్లు సరఫరాని నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, తెలంగాణ ఎక్సైజ్ కమీషనర్ దీనిపై ఏమన్నారంటే..

Fire accident in Madhapur's Krishna Kitchen

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)