Hyderabad, Feb 29: లోక్‌ సభ (Loksabha) ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో (Telangana Government) తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్‌ (BJP MP Laxman) సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని గుర్తుచేశారు. ఇంకా ఆయన  మాట్లాడుతూ... హిమాచల్ ప్రదేశ్‌ లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరగబడ్డారని తెలిపారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ లో కాంగ్రెస్‌‌పై అసహనంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేసినట్లు చెప్పారు.

Narendra Modi Telangana Visit: మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. 4న ఆదిలాబాద్‌ లో, 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ప్రధాని

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)