Madhavi Latha Arrow at Mosque Video: మసీదు వైపు బాణం విడుస్తున్నట్లుగా మాధవీలత యాక్షన్, చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన ఒవైసీ, బీజేపీ అభ్యర్థి రియాక్షన్ ఏంటంటే..
సార్వత్రిక ఎన్నికల వేళ హైదరాబాద్ లో బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫైట్ సెగలు రేపుతోంది. మసీదు వైపు బాణం విడుస్తున్నట్లు సైగలు చేసిన మాధవీలతపై ఈసీ యాక్షన్ తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
2024 భారతదేశం ఎన్నికలు: సార్వత్రిక ఎన్నికల వేళ హైదరాబాద్ లో బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫైట్ సెగలు రేపుతోంది. మసీదు వైపు బాణం విడుస్తున్నట్లు సైగలు చేసిన మాధవీలతపై ఈసీ యాక్షన్ తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను మాధవీ లత తిప్పికొట్టారు. ముస్లీం, హిందువులు అందరికీ కోసం తాను పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. గాల్లో బాణం వదిలితే.. దాన్ని మసీదు వైపు విడిచినట్లు వీడియోలో చూపిస్తే తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపొద్దంటూ అసద్‌పై మాధవీ లత ఫైర్ అయ్యారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత మధ్య ఫైట్ తో హైదరాబాద్ నియోజకవర్గం సెగలు రేపుతోంది. రాజీనామా చేసి రా.. నువ్వా నేనా చూసుకుందాం, కడియం శ్రీహరికి సవాల్ విసిరిన రాజయ్య, వీడియో ఇదిగో..
Here's Videos