HM Amit Shah To visit Hyd: హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్‌లో పోస్టర్లు, కంటోన్మెంట్ యువత పేరుతో వెలసిన పోస్టర్లు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న సంగతి విదితమే. 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ విమోచన దినం కార్యక్రమంలో పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్ లో ఆయన జాతీయ జెండాను ఎగురవేస్తారు.

posters-at-parade-grounds-against-HM-amit-shah-before-hyderabad-tour

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న సంగతి విదితమే. 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ విమోచన దినం కార్యక్రమంలో పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్ లో ఆయన జాతీయ జెండాను ఎగురవేస్తారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్ వద్ద అమిత్ షాకు, బీజేపీకి వ్యతిరేకంగా నిన్న అర్ధరాత్రి పోస్టర్లను అతికించారు. కంటోన్మెంట్ యువత పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవానికి సంబంధించి 20 ప్రశ్నలను కేంద్రానికి, మోదీకి ఎక్కు పెట్టారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎలా సహాయపడిందని పోస్టర్లలో ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర తాకట్టు పెట్టింది ఎవరని అడిగారు.

posters-at-parade-grounds-against-HM-amit-shah-before-hyderabad-tour
Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement