Ashes 1st Test 2021 Day 3: ఓ వైపు మ్యాచ్..మరోవైపు లవ్ ప్రపోజల్, మ్యాచ్ వదిలేసి వీళ్ల లవ్ స్టోరీని హైలెట్ చేసిన కెమెరాలు, ఎక్కడో తెలుసా..

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజైన (Ashes 1st Test 2021 Day 3) నేడు ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా గాళ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ (England cricket Fan Proposes to Girlfriend) చేశాడు. మొదట అతడి వంక ఆశ్చర్యంగా చూసిన అమ్మాయి.. అనుమతి ఇచ్చేందుకు ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు.

Ashes 1st Test 2021 Day 3: ఓ వైపు మ్యాచ్..మరోవైపు లవ్ ప్రపోజల్, మ్యాచ్ వదిలేసి వీళ్ల లవ్ స్టోరీని హైలెట్ చేసిన కెమెరాలు, ఎక్కడో తెలుసా..
Fan-Proposes-to-Girlfriend-During-Ashes-1st-Test (Video Grab)

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇక్కడ తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజైన (Ashes 1st Test 2021 Day 3) నేడు ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా గాళ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ (England cricket Fan Proposes to Girlfriend) చేశాడు. మొదట అతడి వంక ఆశ్చర్యంగా చూసిన అమ్మాయి.. అనుమతి ఇచ్చేందుకు ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. ఆ వెంటనే ముద్దులు, కౌగిలింతలతో స్టేడియం (Cute Proposal Video Goes Viral) హోరెత్తిపోయింది. మ్యాచ్‌ను చిత్రీకరిస్తున్న కెమెరాలు ఒక్కసారిగా అటువైపు తిరిగాయి. స్టాండ్స్‌లోని అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహపరిచారు. కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలిపారు.

మైఖేల్ అనే యువకుడు మోకాళ్లపై కూర్చుని టోరీ అనే యువతిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె క్షణకాలం పాటు నమ్మలేకపోయింది. ఆ వెంటనే తేరుకుని ఓకే చెప్పడంతో అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వెంటనే తన చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికి తొడిగాడు. వారి చుట్టూ ఉన్న అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహ పరచడంతో స్టాండ్స్ కేరింతలతో దద్దరిల్లింది. అయితే యాషెస్ సందర్భంగా గబ్బాలో ఇలాంటి ప్రపోజల్ రావడం ఇదే తొలిసారి కాదు. 2017లోనూ ఓ జంట ఇలానే ప్రపోజ్ చేసుకుని తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 10, 2021 11:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).