MI vs CSK Highlights: పాత కథే నడిచింది, ఓటమితో ఐపీఎల్ 20ని ప్రారంభించిన ముంబై, తొలి విక్టరీ నమోదు చేసిన ధోనీ సేన, సూపర్ ఇన్నింగ్స్ ఆడిన రాయుడు

ఐపీఎల్‌-13 వ సీజన్‌ ఆరంభపు మ్యాచ్‌లో ముంబై పాత కథనే కొనసాగించింది. విక్టరీ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి మ్యాచ్ లోనే దుమ్ములేపింది. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ (Chennai Super Kings Beat Mumbai) సాధించింది. అంబటి రాయుడు (Ambati Rayudu)(71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాటింగ్‌ పవర్‌ చూపించగా, డుప్లెసిస్ (Faf du Plessis) (58 నాటౌట్‌; 44 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి విజయంలో సహకరించాడు.

MI vs CSK Highlights: పాత కథే నడిచింది, ఓటమితో ఐపీఎల్ 20ని ప్రారంభించిన ముంబై, తొలి విక్టరీ నమోదు చేసిన ధోనీ సేన, సూపర్ ఇన్నింగ్స్ ఆడిన రాయుడు
Ambati Rayudu in Action Against CSK (Photo Credits: Twitter)

ఐపీఎల్‌-13 వ సీజన్‌ ఆరంభపు మ్యాచ్‌లో ముంబై పాత కథనే కొనసాగించింది. విక్టరీ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి మ్యాచ్ లోనే దుమ్ములేపింది. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ (Chennai Super Kings Beat Mumbai) సాధించింది. అంబటి రాయుడు (Ambati Rayudu)(71; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాటింగ్‌ పవర్‌ చూపించగా, డుప్లెసిస్ (Faf du Plessis) (58 నాటౌట్‌; 44 బంతుల్లో 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి విజయంలో సహకరించాడు.

ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో సీఎస్కేను సీఎస్‌కేను రాయుడు, డుప్లెసిస్‌లు ఆదుకున్నారు. ఈ జోడి 115 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యాన్ని సాధించి విజయంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో ఆల్‌రౌండర్‌ సామ్‌ కరాన్‌ ఆరు బంతుల్లో రెండు సిక్స్‌లు, 1 సిక్స్‌తో బ్యాట్‌ ఝుళిపించాడు. బౌల్ట్‌ వేసిన 20 ఓవర్‌ తొలి రెండు బంతుల్ని డుప్లెసిస్‌ వరుసగా ఫోర్లు కొట్టడంతో చెన్నై ఇంకా నాలుగు బంతులు ఉండగా విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఐపీఎల్‌ సీజన్‌లో (Indian Premier League 2020) డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను ఒక పేలవమైన రికార్డు భయపెడుతోంది. ఐదేళ్ల క్రితం యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించలేదు. ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత కానీ ముంబై ఇండియన్స్‌ బోణీ కొట్టలేదు. ఇది ముంబైను మళ్లీ సెంటిమెంట్‌ పరంగా కలవర పెట్టింది.

ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 163 లక్ష్య ఛేదనలో భాగంగా సీఎస్‌కే ఆరు పరుగులకే ఓపెనర్లు మురళీ విజయ్‌(1), షేన్‌ వాట్సన్‌(4) వికెట్‌లను ఆదిలోనే కోల్పోయినప్పటికీ రాయుడు మాత్రం చూడచక్కని షాట్లతో మెరిపించాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు మంచి బంతుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా చెత్త బంతి అనిపిస్తే బౌండరీకి పంపించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. బౌలర్‌ ఎవరైనా టైమింగ్‌తో దుమ్ములేపాడు.

ఈ క్రమంలోనే డుప్లెసిస్‌తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో సీఎస్‌కే 14.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి ఒక్కసారిగా ట్రాక్‌లోకి వచ్చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్‌ను పాటిన్‌సన్‌ ఎల్బీగా పెవిలియన్‌కు పంపగా, మురళీ విజయ్‌ను బౌల్ట్‌ ఎల్బీగా ఔట్‌ చేశాడు. దాంతో రెండో ఓవర్‌లోనే సీఎస్‌కే కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రాయుడు-డుప్లెసిస్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. కాగా, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71 పరుగులు చేసిన తర్వాత రాయడు మూడో వికెట్‌గా ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత సీఎస్‌కే టాస్‌ గెలవడం ద్వారా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 162 పరుగులు చేసింది. దీపక్‌ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతినే రోహిత్‌ ఫోర్‌ కొట్టాడు. ఆపై డీకాక్‌కు కూడా బ్యాట్‌ ఝుళింపించాడు. వీరిద్దరూ నాలుగు ఓవర్ల ముగిసేసరికి 45 పరుగులు సాధించి రన్‌రేట్‌ను పదికి పైగా ఉంచారు. కాగా, మ్యాచ్‌ ఒక్కసారిగా ఛేంజ్‌ అయిపోయింది. సీఎస్‌కే స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా వేసిన ఐదో ఓవర్‌ నాల్గో బంతికి రోహిత్‌(12) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, క్వింటాన్‌ డీకాక్‌(33) ఆ తర్వాత ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడు. పేసర్‌ సామ్‌ కరాన్‌ వేసిన ఆరో ఓవర్‌ తొలి బంతికి డీకాక్‌(33) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. డీకాక్‌ 20 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టాడు.

కరాన్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన డీకాక్‌.. వాట్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌(17), సౌరవ్‌ తివారీల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 44 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ ఔటయ్యాడు. అప్పుడు తివారీకి హార్దిక్‌ పాండ్యా కలవడంతో స్కోరు కాసేపు పరుగులు పెట్టింది. కానీ అది ఎంతోసేపు సాగలేదు. తివారీ,హార్దిక్‌లు వరుసగా పెవిలియన్‌ చేరడంతో ఆ తర్వాత వచ్చిన కృనాల్‌, పొలార్డ్‌లు కూడా రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా, జడేజా, దీపక్‌ చాహర్‌ తలో రెండు వికెట్లు సాధించారు, సామ్‌ కరాన్‌, పీయూష్‌ చావ్లా తలో వికెట్‌ తీశారు.

స్కోరు వివరాలు

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) కరన్‌ (బి) చావ్లా 12; డి కాక్‌ (సి) వాట్సన్‌ (బి) కరన్‌ 33; సూర్యకుమార్‌ (సి) కరన్‌ (బి) చహర్‌ 17; సౌరభ్‌ తివారి (సి) డు ప్లెసిస్‌ (బి) జడేజా 42; హార్దిక్‌ (సి) డు ప్లెసిస్‌ (బి) జడేజా 14; పొలార్డ్‌ (సి) ధోని (బి) ఇన్‌గిడి 18; కృనాల్‌ (సి) ధోని (బి) ఇన్‌గిడి 3; ప్యాటిన్సన్‌ (సి) డు ప్లెసిస్‌ (బి) ఇన్‌గిడి 11; రాహుల్‌ చహర్‌ (నాటౌట్‌) 2; బౌల్ట్‌ (బి) చహర్‌ 0; బుమ్రా (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 162.

వికెట్ల పతనం: 1–46; 2–48; 3–92; 4–121; 5–124; 6–136; 7–151; 8–156; 9–156.

బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–32–2; స్యామ్‌ కరన్‌ 4–0–28–1; ఇన్‌గిడి 4–0–38–3; పీయూష్‌ చావ్లా 4–0–21–1; జడేజా 4–0–42–2.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: విజయ్‌ (ఎల్బీ) (బి) ప్యాటిన్సన్‌ 1; వాట్సన్‌ (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 4; డు ప్లెసిస్‌ (నాటౌట్‌) 58; రాయుడు (సి అండ్‌ బి) రాహుల్‌ చహర్‌ 71; జడేజా (ఎల్బీ) (బి) కృనాల్‌ 10; స్యామ్‌ కరన్‌ (సి) ప్యాటిన్సన్‌ (బి) బుమ్రా 18; ధోని (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 166.

వికెట్ల పతనం: 1–5; 2–6; 3–121; 4–134; 5–153.

బౌలింగ్‌: బౌల్ట్‌ 3.2–0–23–1; ప్యాటిన్సన్‌ 4–0–27–1; బుమ్రా 4–0–43–1; కృనాల్‌ 4–0–37–1; రాహుల్‌ చహర్‌ 4–0–36–1.

(The above story first appeared on LatestLY on Sep 20, 2020 09:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).