ICC Test Rankings: బుమ్రాకు షాక్.. ICC టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న మిచెల్ స్టార్క్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ విభాగంలో తొలిసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకోగా, భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గణనీయమైన పురోగతి సాధించాడు.

Mitchell Starc. (Photo credits: X/@sanjayvatts)

ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ విభాగంలో తొలిసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకోగా, భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గణనీయమైన పురోగతి సాధించాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన మిచెల్ స్టార్క్, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని అధిగమించి అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌లో 36 ఏళ్ల స్టార్క్‌కు నంబర్ వన్ ర్యాంక్ లభించడం ఇదే తొలిసారి. శ్రీలంక సిరీస్‌కు బుమ్రా దూరం కావడం కూడా ప్రభావం చూపడంతో ఆయన రెండో స్థానానికి, న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ మూడో స్థానానికి పడిపోయారు. ఆసీస్ బౌలర్లు పాట్ కమిన్స్ 4వ ర్యాంకుకు, నాథన్ లైయన్ 10వ ర్యాంకుకు చేరుకున్నారు.

వైభవ్ సూర్యవంశీ బౌలింగ్ వీడియో ఇదిగో.. రెండు కీలక వికెట్లు తీసిన ఈస్ట్ జోన్ కుర్రాడు..

శ్రీలంకతో గాలెలో జరిగిన తొలి టెస్టులో వేగవంతమైన అర్ధశతకం బాదిన రిషభ్ పంత్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 7వ ర్యాంకులో నిలిచాడు. మరో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 30వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, జో రూట్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ తదుపరి స్థానాల్లో ఉన్నారు. టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకోగా, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఏడో స్థానానికి చేరుకున్నాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement