PBKS vs RCB, IPL 2021: స్పిన్నర్ హర్‌ప్రీత్ దెబ్బకు కోహ్లీ సేన విలవిల, 34 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన కేఎల్ రాహుల్
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండ్ షోతో మురిపించింది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో (PBKS vs RCB, IPL 2021 Stat Highlights) 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ వైఫల్యంతో గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడిన పంజాబ్ ఈ సారి అలాంటి పొరపాట్లకు తావివ్వలేదు.
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండ్ షోతో మురిపించింది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో (PBKS vs RCB, IPL 2021 Stat Highlights) 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ వైఫల్యంతో గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడిన పంజాబ్ ఈ సారి అలాంటి పొరపాట్లకు తావివ్వలేదు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (57 బంతుల్లో 91 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... క్రిస్ గేల్ (24 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు.
అనంతరం బెంగళూరు (Royal Challengers Bangalore) 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్షల్ పటేల్ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రజత్ పటిదార్ (30 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. 19 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసిన పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఎడంచేతి వాటం స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కోహ్లి సేనకు ఇది రెండో ఓటమి.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ తొలి ఐదు ఓవర్లలో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (7) వికెట్ కోల్పోయి 29 పరుగులే చేయగా, గేల్ ఒక్క ఓవర్‌లో పరిస్థితిని మార్చాడు. జేమిసన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో గేల్ వరుసగా 4,4,4,4,0,4తో 20 రన్స్ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో రెండు సిక్సర్లతో చాహల్‌ను ఆడుకున్నాడు. అటు కెప్టెన్ రాహుల్ కూడా జోరు చూపిస్తూ 4,6 బాదాడు. ఈ ఇద్దరి ఆటతో జట్టు మొదటి 10 ఓవర్లలో 90 రన్స్ చేసింది. కానీ 11వ ఓవర్‌లో సామ్స్.. గేల్ వికెట్ తీయడంతో రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
పృథ్వీ షా వన్ మ్యాన్ షో, కోల్‌కతాపై దిల్లీ అలవోక విజయం.. మరో మ్యాచ్ లో రాజస్థాన్ పై ముంబై గెలుపు
ఇక ఎప్పటిలాగే పంజాబ్ మిడిలార్డర్ చెత్త ప్రదర్శన కనబరిచింది. నాలుగు ఓవర్ల వ్యవధిలోనే పూరన్ (0), దీపక్ హుడా (5), షారుక్ (0) వెనుదిరిగారు. అయితే రాహుల్ ఒంటరి పోరాటం చేస్తూ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో హర్‌ప్రీత్ అండగా నిలిచాడు. 18వ ఓవర్‌లో హర్‌ప్రీత్ బ్రార్ 4,6.. రాహుల్ మరో ఫోర్‌తో 18 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో రాహుల్ బ్యాట్ ఝుళిపిస్తూ 4,6,4 బాదగా ఆరో బంతిని బ్రార్ సిక్సర్‌గా మలచడంతో జట్టు 22 పరుగులు రాబట్టింది. ఆరో వికెట్‌కు అజేయంగా ఈ ఇద్దరి మధ్య 32 బంతుల్లో 61 పరుగులు జత చేరాయి. చెన్నైపై చివరి ఓవర్‌లో 37 పరుగులిచ్చిన పేసర్ హర్షల్.. ఈసారి ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు సమర్పించుకున్నాడు.
లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీకి సరైన ఆరంభం లభించలేదు. ఫాస్ట్ బౌలర్ మెరిడిత్ వేసిన మెరుపు బంతి స్టంప్స్‌ను ఎగరగొట్టడంతో దేవ్‌దత్ పడిక్కల్ (7) వెనుదిరిగాడు. పటిదార్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేసినా... అతని బ్యాటింగ్ మరీ నెమ్మదిగా సాగింది. క్రీజ్‌లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించిన కెప్టెన్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించలేకపోయాడు. సగం ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 62 పరుగులు మాత్రమే. బెంగళూరు విజయం కోసం 60 బంతుల్లో 118 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్‌ప్రీత్ ప్రత్యర్థిని బలంగా దెబ్బ కొట్టాడు.
11వ ఓవర్ తొలి బంతికి కోహ్లిని బౌల్డ్ చేసిన అతను తర్వాతి బంతికే మ్యాక్స్‌వెల్ (0) వికెట్లను కూడా గిరాటేశాడు. దాంతో బెంగళూరు విజయపు ఆశలన్నీ డివిలియర్స్ (3)పైనే నిలిచాయి. హర్‌ప్రీత్ తన తర్వాతి ఓవర్లో మరో చక్కటి బంతితో డివిలియర్స్‌ను కూడా వెనక్కి పంపాడు. దాంతో జట్టు గెలుపు దారులు దాదాపుగా మూసుకుపోయాయి. ధాటిగా ఆడే ప్రయత్నంలో పటిదార్ కూడా అవుట్ కాగా... చివర్లో హర్షల్ పటేల్, కైల్ జేమీసన్ (16 నాటౌట్) పోరాడినా లాభం లేకపోయింది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 23 బంతుల్లోనే 48 పరుగులు జోడించారు.
స్కోరు వివరాలు, పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 91; ప్రభ్‌సిమ్రన్ (సి) కోహ్లి (బి) జేమీసన్ 7; గేల్ (సి) డివిలియర్స్ (బి) స్యామ్స్ 46; పూరన్ (సి) షహబాజ్ (బి) జేమీసన్ 0; హుడా (సి) పటిదార్ (బి) షహబాజ్ 5; షారుఖ్ (బి) చహల్ 0; హర్‌ప్రీత్ బ్రార్ (నాటౌట్) 25; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 179.
వికెట్ల పతనం: 1–19, 2–99, 3–107, 4–117, 5–118. బౌలింగ్: స్యామ్స్ 4–0–24–1, సిరాజ్ 3–0–24–0, జేమీసన్ 3–0–32–2, చహల్ 4–0–34–1, హర్షల్ 4–0–53–0, షహబాజ్ 2–0–11–1.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) హర్‌ప్రీత్ 35; పడిక్కల్ (బి) మెరిడిత్ 7; పటిదార్ (సి) పూరన్ (బి) జోర్డాన్ 31; మ్యాక్స్‌వెల్ (బి) హర్‌ప్రీత్ 0; డివిలియర్స్ (సి) రాహుల్ (బి) హర్‌ప్రీత్ 3; షహబాజ్ (సి) హర్‌ప్రీత్ (బి) రవి బిష్ణోయ్ 8; స్యామ్స్ (బి) రవి బిష్ణోయ్ 3; జేమీసన్ (నాటౌట్) 16; హర్షల్ (సి) బిష్ణోయ్ (బి) షమీ 31; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 145.
వికెట్ల పతనం: 1–19, 2–62, 3–62, 4–69, 5–91, 6–96, 7–96, 8–144.
బౌలింగ్: రిలీ మెరిడిత్ 3.2–0–29–1, షమీ 3.4–0–28–1, రవి బిష్ణోయ్ 4–0–17–2, హర్‌ప్రీత్ బ్రార్ 4–1–19–3, జోర్డాన్ 4–0–31–1, హుడా 1–0–13–0.
(The above story first appeared on LatestLY on May 01, 2021 10:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

