WTC Final 2023: భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్, గెలిస్తే రూ. 13. 2 కోట్లు, ఓడిన జట్టుకు రూ. 6.61 కోట్లు, డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ
డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (మే 26) ప్రకటించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జూన్ 7న ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో విజేతకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (Rs 13.2 crore) దక్కనుండగా.. రన్నరప్‌కు 800,000 డాలర్లు ప్రైజ్‌మనీ ( Rs. 6.61 crore) రూపంలో దక్కనున్నాయి.
డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (మే 26) ప్రకటించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జూన్ 7న ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో విజేతకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (Rs 13.2 crore) దక్కనుండగా.. రన్నరప్‌కు 800,000 డాలర్లు ప్రైజ్‌మనీ ( Rs. 6.61 crore) రూపంలో దక్కనున్నాయి. ఈ డబ్ల్యూటీసీ సీజన్ సైతం గత సీజన్‌లో లాగే 3.8 మిలియన్ డాలర్ల పర్స్ విలువ కలిగి ఉంది.
తొలి స్థానంలో నిలిచే జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు, రెండో స్థానంలో నిలిచే జట్టుకు 800,000 డాలర్లు, మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 450,000 డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 350,000 డాలర్లు, ఐదో ప్లేస్‌లో ఉన్న శ్రీలంకకు 200,000 డాలర్లు, ఆ తర్వాత ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు తలో 100,000 డాలర్ల ప్రైజ్‌మనీ షేర్ చేయబడుతుంది.
(The above story first appeared on LatestLY on May 26, 2023 03:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

