SRH vs RCB Highlights IPL 2020: తొలి మ్యాచ్‌లో చతికిల పడ్డ సన్‌రైజర్స్‌, బోణీ కొట్టిన బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌

ఐపీఎల్‌-13లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దెబ్బకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి పాలయింది. సాధారణ స్కోరును సైతం ఛేదించలేక ఎస్‌ఆర్‌హెచ్‌ చతికిలబడింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (SRH vs RCB) ఒత్తిడిని జయించిన ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఘన విజయం (Royal Challengers Bangalore Beat Sunrisers) సాధించింది. ఆర్సీబీ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ తన మ్యాజిక్‌ బౌలింగ్‌తో అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో బెయిర్‌ స్టో(61) ను బౌల్డ్‌ చేసిన చహల్‌.. ఆ తర్వాత బంతికి విజయ్‌ శంకర్‌(0) బౌల్డ్‌ చేశాడు. 16వ ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్లో చహల్‌ వికెట్లు సాధించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

SRH vs RCB Highlights IPL 2020: తొలి మ్యాచ్‌లో చతికిల పడ్డ సన్‌రైజర్స్‌, బోణీ కొట్టిన బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌
AB de Villiers (Photo Credits: IANS)

ఐపీఎల్‌-13లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దెబ్బకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి పాలయింది. సాధారణ స్కోరును సైతం ఛేదించలేక ఎస్‌ఆర్‌హెచ్‌ చతికిలబడింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (SRH vs RCB) ఒత్తిడిని జయించిన ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఘన విజయం (Royal Challengers Bangalore Beat Sunrisers) సాధించింది. ఆర్సీబీ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ తన మ్యాజిక్‌ బౌలింగ్‌తో అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో బెయిర్‌ స్టో(61) ను బౌల్డ్‌ చేసిన చహల్‌.. ఆ తర్వాత బంతికి విజయ్‌ శంకర్‌(0) బౌల్డ్‌ చేశాడు. 16వ ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్లో చహల్‌ వికెట్లు సాధించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

బెయిర్‌ స్టో నీట్‌గా ఆడుతున్న సమయంలో చహల్‌ ఇచ్చిన బ్రేక్‌తో ఆర్సీబీలో ఉత్సాహం వచ్చింది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్‌ శంకర్‌ తొలి బంతికే వికెట్‌ ఇవ్వడం సన్‌రైజర్స్‌ను కష్టాల్లోకి నెట్టింది. అంతకుముందు మనీష్‌ పాండే(34)ను సైతం చహల్‌ ఔట్‌ చేశాడు. చహల్‌ వేసిన స్లో బంతిని హిట్‌ చేయబోయి మనీష్‌ పాండే ఔటయ్యాడు. ఇక ఐదో వికెట్‌గా ప్రియాం గార్గ్‌(12)ను శివం దూబే ఔట్‌ చేయడంతో ఆర్సీబీ 129 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. కాసేపటికి అభిషేక్‌ శర్మ(7) రనౌట్‌ కావడంతో రైజర్స్‌ తేరుకోలేకపోయింది. ప్రియాం గార్గ్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రషీద్‌ ఖాన్‌ ఊపుమీద కనిపించాడు. వచ్చీ రావడంతోనే దూబే బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టాడు. కానీ 17 ఓవర్‌లో పరుగు కోసం యత్నించే క్రమంలో రషీద్‌ ఖాన్‌-అభిషేక్‌ పిచ్‌ మధ్యలో ఢీకొనడంతో ఇద్దరూ కింద పడిపోయారు. దాంతో అప్పటికే కీపర్‌ వద్దకు చేరిన బంతితో అభిషేక్‌ రనౌట్‌ అయ్యాడు. ఫలితంగా ఓవరాల్‌గా గెలిచే అవకాశం ఉ‍న్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ చేజార్చుకుంది.

రెండో మ్యాచ్‌కే సూపర్ ఓవర్, ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌‌దే గెలుపు, ఢిల్లీ తరపున చెలరేగిన స్టొయినిస్‌, పంజాబ్ తరపున మయాంక్ అగర్వాల్ ఒంటరి పోరాటం

ఈ మ్యాచ్‌లో ఐదుగురు సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు బౌల్డ్‌ కావడం గమనార్హం. వార్నర్‌(6) రెండో ఓవర్‌లోనే రనౌట్‌ కావడంతో సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ మూడు వికెట్లు సాధించగా, సైనీ, దూబేలు తలో రెండు వికెట్లు సాధించారు. స్టెయిన్‌కు వికెట్‌ దక్కింది.

అంతకుముందు ఆర్సీబీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది . ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కేరళ కుర్రాడు దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌లు ఆరంభించారు. వీరిద్దరూ దాటిగా ఆడి ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా పడిక్కల్‌ దాటిగా బ్యాటింగ్‌ చేసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, ఫించ్‌ మాత్రం కాస్త నెమ్మదిగా ఆడాడు. పడిక్కల్‌ 42 బంతుల్లో 8ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫించ్‌ దూకుడు పెంచే యత్నంలో అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. పడిక్కల్‌ను విజయ్‌శంకర్‌ బౌల్డ్‌ చేసిన స్వల్ప వ్యవధిలోనే ఫించ్‌ కూడా ఔటయ్యాడు. కోహ్లి(14) నిరాశపరచాడు. ఏబీడీ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. నటదూబే(7) ఆట మరీ పేలవంగా సాగింది ఆర్సీబీ నిర్ణీత 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 164 పరుగులు లక్ష్యంతొ దిగిన సన్ రైజర్స్ 153 పరుగులకు ఆలౌటైంది.

స్కోరు వివరాలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దేవ్‌దత్‌ (బి) విజయ్‌ 56; ఫించ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) అభిషేక్‌ 29; కోహ్లి (సి) రషీద్‌ (బి) నటరాజన్‌ 14; డివిలియర్స్‌ (రనౌట్‌) 51; దూబే (రనౌట్‌) 7; ఫిలిప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163.

వికెట్ల పతనం: 1–90, 2–90, 3–123, 4–162, 5–163.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–25–0, సందీప్‌ 4–0–36–0, నటరాజన్‌ 4–0–34–1, మార్ష్ 0.4–0–6–0, విజయ్‌ 1.2–0– 14–1, రషీద్‌ 4–0–31–0, అభిషేక్‌ 2–0–16–1.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (రనౌట్‌) 6; బెయిర్‌స్టో (బి) చహల్‌ 61; మనీశ్‌ పాండే (సి) సైనీ (బి) చహల్‌ 34; ప్రియమ్‌ గార్గ్‌ (బి) దూబే 12; విజయ్‌ (బి) చహల్‌ 0; అభిషేక్‌ (రనౌట్‌) 7; రషీద్‌ (బి) సైనీ 6; భువనేశ్వర్‌ (బి) సైనీ 0; సందీప్‌ శర్మ (సి) కోహ్లి (బి) స్టెయిన్‌ 9; మార్‌‡్ష (సి) కోహ్లి (బి) దూబే 0; నటరాజన్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 153.

వికెట్ల పతనం: 1–18, 2–89, 3–121, 4–121, 5–129, 6–135, 7–141, 8–142, 9–143, 10–153.

బౌలింగ్‌: స్టెయిన్‌ 3.4–0–33–1, ఉమేశ్‌ 4–0–48–0, సైనీ 4–0–25–2, సుందర్‌ 1–0– 7–0, చహల్‌ 4–0–18–3, దూబే 3–0–15–2.

(The above story first appeared on LatestLY on Sep 22, 2020 07:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).