Kieron Pollard Sixes Video: పొలార్డ్ బాదుడు దెబ్బకి రెండు సార్లు గ్రౌండ్ దాటి రోడ్డు మీద పడిన బంతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్, బంతిని తీసుకుని పరిగెత్తిన ఓ వ్యక్తి

యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఎంఐ ఎమిరేట్స్ తరపున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరెన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా (Kieron Pollard Sixes) చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు.

Kieron Pollard Sixes Video: పొలార్డ్ బాదుడు దెబ్బకి రెండు సార్లు గ్రౌండ్ దాటి రోడ్డు మీద పడిన బంతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్, బంతిని తీసుకుని పరిగెత్తిన ఓ వ్యక్తి
Kieron Pollard (Photo Credits: Twitter/IPL)

యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఎంఐ ఎమిరేట్స్ తరపున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరెన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా (Kieron Pollard Sixes) చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇందులో రెండు సిక్స్ లు మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి. పొలార్డ్ హిట్ ధాటికి బంతులు రెండు సార్లు ఏకంగా గ్రౌండ్ బయట పడ్డాయి.

తొలిసారి గ్రౌండ్ బయటికి సిక్స్ కొట్టినప్పుడు.. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బంతి ఇవ్వలేదు. బంతిని తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తాడు. రెండోసారి కొట్టినప్పుడు మాత్రం ఇంకో వ్యక్తి వచ్చి.. స్టేడియంలోకి బంతిని విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Kieron Pollard Sixes Video) అవుతోంది.

మరో భారత్ క్రికెటర్ గుడ్‌బై, క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన టీమిండియా ఓపెనర్ మురళి విజయ్‌

ఈ వీడియోను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘సిక్స్ ల వర్షం కురుస్తున్నప్పుడు.. రెండు రకాల క్రికెట్ లవర్లు ఉంటారు.. ఒకరు బంతిని తీసుకుని పరిగెడుతారు.. ఇంకొకరు తిరిగిస్తారు. మీరు ఏ కేటగిరీ?’’ అని క్యాప్షన్ ఇచ్చారు.

Here's Video

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇంటర్నేషనల్ లీగ్ టీ20 జరుగుతోంది. ఎంఐ ఎమిరేట్స్, డెజర్ట్ వైపర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (50), ముహమ్మద్ వాసీమ్ (86), కీరెన్ పొలార్డ్ (50).. చెలరేగడంతో 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చతికిల పడిన డెజర్ట్ వైపర్స్ టీమ్.. 84 పరుగులకే ఆలౌట్ అయింది.

(The above story first appeared on LatestLY on Jan 31, 2023 09:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).