టీమిండియా ఓపెనర్ మురళి విజయ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. న రిటైర్మెంట్ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. రిటైర్మంట్ నోట్‌లో విజయ్ తనకు సహకరించిన వారందికీ ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల (2002-2018) పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని విజయ్ పేర్కొన్నాడు.
తనకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, చెమ్‌ప్లాస్ట్ సన్మార్ ఫ్రాంచైజీల యజమాన్యాలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపాడు. 38 ఏళ్ల మురళి విజయ్.. టీమిండియా తరఫున 61 టెస్ట్‌లు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 3982 పరుగులు చేసిన విజయ్.. వన్డేల్లో ఒక హాఫ్ సెంచరీ సాయంతో 339 పరుగులు, టీ20ల్లో 169 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో 106 మ్యాచ్‌లు ఆడిన విజయ్.. 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 2619 పరుగులు చేశాడు.విజయ్ తన ఐపీఎల్ ప్రస్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే కౌంటీల్లో ఎసెక్స్, సోమర్‌సెట్ జట్ల తరఫున ఆడాడు.
Here's His Tweet
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)