వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి(Vijayasai Reddy). రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలని నిన్న జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే(Vijaya saireddy on Jagan Words), ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు అని తేల్చిచెప్పారు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని వదులుకున్నా అని ఎక్స్ వేదికగా వెల్లడించారు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

చంద్రబాబు కాదు చంద్రముఖి.. ఏపీ సీఎంపై జగన్‌ తీవ్ర ఆగ్రహం, బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?,వాలంటీర్లనే కాదు ఉద్యోగులకు హ్యాండ్‌ ఇచ్చిన బాబు 

ఆది నుండి వైఎస్ జగన్ వెన్నంటే నడిచారు విజయసాయిరెడ్డి. వైసీపీలో నెంబర్ 2గా ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ ఓ డిపోవడంతో రాజ్యసభకు, పార్టీ పదవికి రాజీనామా చేశారు.

Vijay Sai Reddy counter to YS Jagan words

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)