New Districts in AP: ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు! జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావించిన ఏపీ సీఎం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన

ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు (New Districts in AP) ఏర్పడబోతున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ (Chief Minister YS Jagan Mohan Reddy) ఈరోజు క్లారిటీ ఇచ్చినట్లుగా వార్తలు అందుతున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) మాట్లాడుతూ... ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నుంచి ఈ మాట రాగానే అలర్ట్ అయిన అధికారులు తమ వైపు నుంచి కసరత్తును ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

New Districts in AP: ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు! జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావించిన ఏపీ సీఎం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన
AP CM YS Jagan (Photo-Twitter)

Amaravati, june 23: ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు (New Districts in AP) ఏర్పడబోతున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ (Chief Minister YS Jagan Mohan Reddy) ఈరోజు క్లారిటీ ఇచ్చినట్లుగా వార్తలు అందుతున్నాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) మాట్లాడుతూ... ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నుంచి ఈ మాట రాగానే అలర్ట్ అయిన అధికారులు తమ వైపు నుంచి కసరత్తును ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో అన్ని గ్రామాలకు 104 వాహనం వెళ్లాలి, పేషెంట్లకు అక్కడే మందులు ఇవ్వాలి, అధికారులకు ఆదేశాలు జారీచేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలపై దృష్టిని సారించింది. కొత్త జిల్లాల (new districts) ఏర్పాటుపై గతంలోనే అధికారులతో వైయస్ జగన్ చర్చించిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లోనే ముఖ్యమంత్రి నుంచి దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని అందరూ భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. తాజాగా కొత్త జిల్లాల అంశాన్ని జగన్ మరోసారి ప్రస్తావించడంతో ఈ అంశంపై ఆయన చాలా సీరియస్ గానే ఉన్నట్టు అర్థమవుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌, 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీ, ఐజీవైతో కీలక ఒప్పందం చేసుకున్న ఏపీ సర్కారు

మరోవైపు రాష్ట్ర విజభన తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని పాత 10 జిల్లాలను ఏకంగా 33 జిల్లాలుగా విభజించింది.ఈ నేపథ్యంలో ఏపీలో కూడా 25 జిల్లాలు రానున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి.

(The above story first appeared on LatestLY on Jun 23, 2020 05:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).