Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, June 22: కరోనా నియంత్రణ చర్యలపై (COVID-19) సోమవారం ఏపీ సీఎం వైయస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష (AP CM YS Jagan Review) జరిపారు. ఈ సమీక్షలో 104 వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. . 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌ చేయాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలిచ్చారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు హాజరయ్యారు. రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలు, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఆదివారం తడిసి ముద్దయిన విజయవాడ

‘104’ వాహనాల్లో కోవిడ్‌-19 శాంపిల్‌ సేకరణ సేకరించాలని, షుగర్‌, బీపీ లాంటీ వాటికి పరీక్షలు చేయడంతో పాటు అక్కడే మందులివ్వాలని సూచించారు. అవసరమనుకున్న వారిని పీహెచ్‌సీకి రిఫర్ చేయాలన్నారు. ‘104’ సిబ్బందితో పాటు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లను అనుసంధానం చేసి ప్రతినెలలో ఒక రోజు తప్పనిసరిగా అన్ని గ్రామాలకు ‘104’ వాహనం వెళ్లాలన్నారు. ప్రస్తుతం చేస్తున్న కోవిడ్‌ పరీక్షల్లో హేతుబద్ధమైన, పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు! విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్లు వెల్లడి

కంటైన్‌మెంట్‌ జోన్లలో 50 శాతం, మిగతా చోట్ల 50 శాతం కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి. కొన్ని పరీక్షలు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకునే వారికి కేటాయించాలి. ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారికి వారికి కోవిడ్‌ పరీక్షలు చేయాలి. అలాగే వైరస్‌ వ్యాపించడానికి అవకాశం ఉన్న ఇతర రంగాల్లో పరీక్షలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఒక వ్యక్తికి కరోనా సోకిందన్న అనుమానం రాగానే, ఏం చేయాలన్న దానిపై ఇప్పటివరకు నిర్దేశించిన విధానాన్ని బలోపేతం చేయాలన్నారు. లోకల్‌ ప్రోటోకాల్‌ ను రూపొందించి, ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు ఎస్‌వోపీని ఆ ఇంటికి తెలియజేయాలన్నారు. అలాగే టెలిఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. టీడీపీకి భంగపాటు, ఏపీలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ, దేశంలో 11 స్థానాలకు ఫలితాలు వెల్లడి

కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఏం చేయాలన్న దానిపై ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఒక హోర్డింగ్‌ పెట్టి అందులో వివరాలు ఉంచాలి. అందులో ఫోన్‌ నంబర్, ఎవర్ని సంప్రదించాలి, పరీక్షలకు ఎక్కడకు వెళ్లాలన్న కనీస వివరాలు ఉంచాలి. సబ్‌ సెంటర్లు వచ్చిన తర్వాత ప్రతి గ్రామస్థాయిలోకూడా వైద్య సేవలు అందుతాయి. పట్టణ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో ఉంచుకుని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ప్లాన్‌ చేయాలి. అర్బన్‌ ప్రాంతాల్లో కోవిడ్‌ నివారణకు ప్రత్యేక వ్యూహాన్ని తయారు చేయాలి. అర్బన్‌ ప్రాంతాల జనాభా ప్రాతిపదికన, అవసరమైన ప్రాంతాల్లో అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు. పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌, 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీ, ఐజీవైతో కీలక ఒప్పందం చేసుకున్న ఏపీ సర్కారు

కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రిపోర్టు చేసేలా ఉండాలని, వీటికి సమీప ప్రాంతాల్లో టెస్టింగ్‌ సదుపాయం, మెడికేషన్‌ అందుబాటులో ఉంచాలన్నారు. శానిటేషన్‌పైన కూడా దృష్టి పెట్టి, ప్రజలకు అవగాహన కలిగించేలా హోర్డింగ్స్‌ పెట్టాలని తెలిపారు.1.42 కోట్ల ఆరోగ్య కార్డుల్లో 1.20 కోట్ల పంపిణీ పూర్తి అయ్యాయని, మిగతా పంపిణీ కూడా పూర్తి చేయాలన్నారు. అనంతరం ప్రతి మనిషి ఆరోగ్య వివరాలను ఆరోగ్య కార్డులో నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. 104, 108 కొత్త వాహనాలు జులై 1కి ప్రారంభమవుతాయన్నారు. ఆరోగ్యశ్రీ కిందకు కోవిడ్‌ను తొలిసారిగా తీసుకువచ్చింది మనమేనని తెలిపారు. మనుషులకైనా, పశువులకైనా, ఆక్వారంగంలో వినియోగించే ఔషధాలకైనా డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు ఉండాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ ప్రభుత్వానిదే ఘన విజయం

వైఎస్‌ జగన్‌ ఏడాది పాలనపై ‘సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌’ (సీసీఎస్‌) జూన్‌ 2 నుంచి 8 వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాలు.. 44 నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నట్లు వెల్లడైంది. మొత్తం 2,881 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 55.2 శాతం గ్రామీణ, 44.8 శాతం మంది పట్టణ ప్రాంత ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 133–135 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంటుందని సీపీఎస్‌ తన సర్వేలో చెప్పింది. కాగా, సీపీఎస్‌ తాజా సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 55.8 శాతం మంది ప్రజలు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండాలని కోరుకుంటుండగా.. 38.3 శాతం మంది టీడీపీని కోరుకుంటున్నారు. బీజేపీ, జనసేన రెండు పార్టీలకూ కలిపి 5.3 శాతం ప్రజలు మద్దతు పలుకుతున్నారు.

AP CM YS jagan Fathers Day Tweet

వైయస్ జగన్ ఫాదర్స్ డే ట్వీట్

నాన్నే నా బలం. ప్రతి అడుగులోనూ ఆయనే నాకు స్ఫూర్తి. తండ్రులు పడే తపన.. వారు చేసే పోరాటం.. చూపించే ప్రేమ.. మద్దతు అంతా తమ పిల్లల అభివృద్ధిని కళ్లారా చూడ్డం కోసమే. తండ్రి మనకు మొట్టమొదటి మంచి స్నేహితుడు. మనలను తీర్చిదిద్దే వ్యక్తి.. మన హీరో.. అలాంటి వ్యక్తితో మనమెన్నో మధురమైన క్షణాలను పంచుకుంటాం. తండ్రులందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ట్వీట్‌ చేశారు.