Rajya Sabha Election Results 2020: టీడీపీకి భంగపాటు, ఏపీలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ,  దేశంలో 11 స్థానాలకు ఫలితాలు వెల్లడి
AP Rajya Sabha Election Results 2020 (Photo-Twitter)

Amaravati, June 19: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు (AP Rajya Sabha Election Results 2020) ఏకపక్షంగా సాగాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ (YSRCP) తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి. పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌, 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీ, ఐజీవైతో కీలక ఒప్పందం చేసుకున్న ఏపీ సర్కారు

గెలుపొందిన ఒక్కొక్క అభ్యర్థికి 38 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు (TDP Varla Ramayya) 17 ఓట్లు వచ్చాయి. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ చేపట్టారు. తాజా గెలుపుతో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం ఆరుకు చేరింది.

ysrcp-won-four-seats-in-andhra-pradesh

నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అభినందనలు తెలియజేశారు. ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వినిపించడానికి వారితో కలిసి పనిచేయడానికి తను ఎదురు చూస్తున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Here's AP CM YS jagan Tweet

Here's Parimal Nathwani Tweet

Here's Alla Ayodhya Rami Reddy Tweet

వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు నేడు జరిగిన ఎన్నికల పోలింగ్‌ ఫలితాలు (Rajya Sabha Election Results 2020) వెల్లడయ్యాయి. 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్‌ను చేపట్టారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ను చేపట్టారు. గుజరాత్‌లో నాలుగు స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌-4, రాజస్థాన్‌-3, జార్ఖండ్‌-2, మణిపూర్‌-1, మేఘాలయా-1, మిజోరాంలో 1 స్థానానికి నేడు పోలింగ్‌ జరిగింది. ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ నిర్వహణకు సాధారంగా చేసే ఏర్పాట్లతో పాటు కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఓటేసే మార్గం, ఓటేసిన తర్వాత బయటకు వచ్చే మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేసింది. అంసెబ్లీలోకి ప్రవేశించే ఎమ్మెల్యేలకు థర్మల్‌ స్క్రీనింగ్‌ను నిర్వహించింది.

ఇప్పటివరకు 11 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య జరిగిన రసవత్తర పోరులో.. రెండు పార్టీలు సమఉజ్జీగా నిలిచాయి. రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌ రెండు స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది.

ఇక మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే రిపీట్‌ అయింది. అధికార బీజేపీ రెండు స్థానాల్లో, కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన కేసీ వేణుగోపాల్‌, నీరజ్‌ దండి, బీజేపీ నుంచి రాజేంద్ర గెహ్లాట్‌ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, సమర్‌ సింగ్‌ సోలంకి, కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ విజయంసాధించారు.

మేఘాలయా నుంచి అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) అభ్యర్థి డాక్టర్‌ డబ్ల్యూఆర్‌ ఖర్లుఖీ విజయం సాధించారు. మిజోరాం నుంచి అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అభ్యర్థి కె.వాన్లాల్వేనా విజయం సాధించారు. జార్ఖండ్‌ నుంచి బీజేపీ, జార్ఖండ్‌ ముక్తి మోర్చా చెరో స్థానంలో విజయం సాధించాయి. గుజరాత్, మణిపూర్ ఫలితాలు రావాల్సి ఉంది.