Vaccine Manufacturing Unit in Pulivendula (Photo-Twitter)

Amaravati, June 19: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు మరో ముందడుగు వేసింది. ఏపీలో ప్రపంచస్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని (Vaccine Manufacturing Unit) నెలకొల్పే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేసింది. పులివెందుల ఏపీ కార్ల్‌లో (APCARL In Pulivendula) వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) సమక్షంలో ఐజీవైతో (Immunologix India Pvt Ltd (IGY)అవగాహన ఒప్పందం కుదురింది. ఈ మేరకు ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు (APCARL CEO Dr M Srinivasarao), ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒక్కరి ద్వారా 226 మందికి కరోనా అంటుకుంది, మళ్లీ ఒంగోలులో 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్, ఏపీలో కొత్తగా 376 కేసులు నమోదు, 6230కి చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య

కాగా రాష్ట్ర విభజన తర్వాత పశువులకు అవసరమైన వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రం లేకపోవడంతో ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం కోసం ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదురింది. ఈ ఒప్పందంలో భాగంగా 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీని ప్రారంభించనున్నారు.

Here's YSR Congress Party Tweet

ఇక్కడ పశువులకు కావాల్సిన అన్నిరకాల వ్యాక్సిన్లు తయారీ కానున్నాయి. గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌కు ఐజీవై దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించనుంది. ఈ ప్లాంటు ఏర్పాటుతో 100 నిపుణులకు, సిబ్బందికి ఉపాధి కలుగనుంది. మన రాష్ట్రాలు అవసరాలు తీర్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.