Coronavirus Outbreak in India | PTI Photo

Amaravati,June 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 376 కొత్త కేసులు (Andhra Pradesh Coronavirus) నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,609 శాంపిల్స్‌ని పరీక్షించగా 376 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 82 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో మరో నలుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 6230కి (coronavirus cases in AP) చేరింది.  ఫ్యామిలీ సభ్యుల మధ్య వేగంగా కరోనా వ్యాప్తి, రికార్డు స్థాయిలో గత 24 గంటల్లో 13,586 కోవిడ్-19 కేసులు నమోదు, దేశంలో 3 లక్షల 80 వేలకు చేరిన కరోనా కేసుల సంఖ్య

ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 96గా నమోదైంది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3065కి (AP Coronavirus) చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 3069 మంది చికిత్స పొందుతున్నారు.

కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం మరో మైలురాయిని దాటింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 13,923 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షలు చేసిన వారి సంఖ్య 6,12,397కు చేరింది.

Here's AP Corona virus Report

రాష్ట్రంలో తొలి లక్ష పరీక్షలు నిర్వహించడానికి 58 రోజులు పట్టగా.. ఇప్పుడు వారం రోజుల్లోనే లక్షకుపైగా పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి చేరుకుంది. జూన్‌ 10న 5 లక్షల మార్కును అందుకోగా వారం రోజుల్లోనే జూన్‌ 17న ఆరు లక్షల మార్కును అధిగమించింది. దీంతో ప్రతీ పది లక్షల మందికి సగటున 11,468 పరీక్షలు నిర్వహించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచింది. ఆరు లక్షల మార్కుకు చేరిన కరోనా టెస్టులు

ఇదిలా ఉంటే తూర్పుగోదావ‌రి జిల్లా పెద‌పూడి మండంలో క్క వ్య‌క్తి ద్వారా 222 మందికి క‌రోనా సోకింది. పెద‌పూడి మండంలోని గొల్ల‌ల మామిడాడ‌లో గ‌త నెల (మే) 21న క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. ఈ ఒక్క కేసుతో 222 మందికి క‌రోనా బారిన ప‌డ్డారు. ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్ కేసులు రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం పెద‌పూడి మండ‌లంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 125కి పెరిగింది. మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది క‌రోనా వైరస్‌ బారిన పడిన‌ట్టు వైద్యాధికారులు తేల్చి చెప్పారు. జేసీ ఫ్యామిలీకి షాక్, బెయిల్ పిటిషన్ తిరస్కరించిన అనంతపురం కోర్టు, మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ

ప్రకాశం జిల్లా కేంద్రంలో మళ్లీ కంటైన్‌మెంట్‌ జోన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేసే దిశగా యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఒంగోలు నగరంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోవడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది. దీంతో నిర్బంధం ఒక్కటే విరుగుడుగా యంత్రాంగం భావించింది. ఈ నేపథ్యంలో నగరంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఒంగోలు నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఎల్లుండి (ఆదివారం) నుంచి నగరంలో పూర్థిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంతో జిల్లాలో పాజిటివ్‌ కేసులు పూర్తిగా తగ్గిపోయి జీరో అయిన సంగతి తెలిసింది. తాజాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి జిల్లా కేంద్రంలో మళ్లీ అవే నిబంధనలు పూర్తిగా అమలు చేయబోతున్నారు.

ఇక్కడ బుధవారం అత్యధికంగా 24 కేసులు నమోదయ్యాయనుకుంటే తాజాగా గురువారం అందిన రిపోర్టులలో రికార్డు స్థాయిలో 38 కేసులు ఉండటం ఇటు జిల్లావాసులను, అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తాజా కేసుల్లో ఒక్క చీరాల పట్టణంలోనే అత్యధికంగా 16 కేసులు నమోదు కాగా జిల్లా కేంద్రంలో ఎనిమిది కేసులు, పామూరులో ఆరు కోవిడ్‌–19 కేసులు ఉన్నాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 268కి చేరింది.

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రేప్‌ కేసులో విజయవాడ కోర్టు రిమాండ్‌ విధించడంతో శిక్ష అనుభవించేందుకు నిమిత్తం ఖైదీని ఈనెల 16న రాజమహేంద్రవరం సెంట్రల్‌జైల్‌ కు తరలించారు. రిమాండ్‌ ఖైదీకి పాజిటివ్‌ ఉన్నట్టు ఈనెల 17వ తేదీ రాత్రి జైల్‌ అధికారులకు విజయవాడ నుంచి సమాచారం అందించడంతో వెంటనే చికిత్స కోసం అతడిని క్వారంటైన్‌కు తరలించామని సెంట్రల్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌. రాజారావు తెలిపారు. ఖైదీతో పాటు బ్లాక్‌లో ఉన్న సహ రిమాండ్‌ ఖైదీలకు, సెంట్రల్‌ జైల్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా టెస్ట్‌లు చేయిస్తున్నామని సెంట్రల్‌జైల్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. ఖైదీల్లో ఎవరికైనా పాజిటివ్‌ కేసులు నమోదైతే వెంటనే క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.