CM Jagan Speech Highlights: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ సెటైర్, ఒక్క జగన్‌ను కొట్టడానికి అందరూ ఏకమయ్యారు, నేను దేవుడిని నమ్ముకున్నా.. అక్కా చెల్లెమ్మలను నమ్ముకున్నా, సీఎం స్పీచ్ హైలెట్స్ ఇవే..

రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan Speech Highlights) పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేసి వాటికి క్లియరెన్స్ ఇస్తున్నామని జగన్ చెప్పారు. అవనిగడ్డలో రైతులకు భూమి పట్టాలు పంచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.

CM Jagan Speech Highlights: పవన్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ సెటైర్, ఒక్క జగన్‌ను కొట్టడానికి అందరూ ఏకమయ్యారు, నేను దేవుడిని నమ్ముకున్నా.. అక్కా చెల్లెమ్మలను నమ్ముకున్నా, సీఎం స్పీచ్ హైలెట్స్ ఇవే..
CM Jagan (Photo/Twitter-AP CMO)

Avanigadda, Oct 20: రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan Speech Highlights) పేర్కొన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేసి వాటికి క్లియరెన్స్ ఇస్తున్నామని జగన్ చెప్పారు. అవనిగడ్డలో రైతులకు భూమి పట్టాలు పంచి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. చుక్కల, అనాధీన, నిషేధిత జాబితా 22(1)లోని భూములను డీనోటిఫై చేశామని, ఇకపై ఆ భూములపై యజమానులకు సర్వహక్కులు ఉంటాయని జగన్ తెలిపారు. తమ భూములు అమ్ముకోవచ్చు, బిడ్డల పేరుమీదికి మార్చుకోవచ్చని వివరించారు. గత ప్రభుత్వం 2016 మే నెలలో ఈ భూములను నిషేధిత జాబితాలోకి చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని సీఎం విమర్శించారు.

రైతుల కష్టాలను అర్థం చేసుకున్న ప్రభుత్వాలు మహానేత వైఎస్సార్ ప్రభుత్వం.. తర్వాత మళ్లీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వమేనని వివరించారు. రాష్ట్రంలో భూసర్వే పేరుతో పెద్ద యజ్ఞం జరుగుతోందని సీఎం చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో భూములకు కచ్చితమైన రికార్డులు లేవని సీఎం చెప్పారు. ఉన్న రికార్డులలోనూ కచ్చితమైన వివరాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదని వివరించారు.

వంద ఏళ్ల తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే, 15వేల మంది సర్వేయర్లను రిక్రూట్‌ చేశాం, అవనిగడ్డ పర్యటనలో సీఎం జగన్

ఈ పరిస్థితుల్లో దాదాపు 22 వేల రైతులకు ప్రయోజనం కలిగేలా ఆధునిక టెక్నాలజీ సాయంతో భూముల సర్వే చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 15 వేల మందికి పైగా సర్వేయర్లను మీ అన్న జగనన్న సర్కారు నియమించిందని తెలిపారు. నవంబర్ చివరిలోగా 1500 గ్రామాల్లో భూసర్వే పూర్తిచేసి హద్దులు నిర్ణయిస్తామని సీఎం చెప్పారు. వచ్చే ఏడాదికల్లా 17 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని వెల్లడించారు.

సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా భూములకు కచ్చితమైన రికార్డులు లేవు

రికార్డుల్లో వివరాలు పక్కాగా లేకపోవడంతో ఇబ్బందులు

వంద ఏళ్ల తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నాం

15వేల మంది సర్వేయర్లను రిక్రూట్‌ చేశాం

అత్యాధునిక పరికరాలను భూ సర్వేకు ఉపయోగిస్తున్నాం

విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నాం

భూముల రీసర్వేతో రికార్టులను అప్‌డేట్‌ చేస్తున్నాం

చుక్కల భూములని, అనాధీన భూములని ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పరిష్కారం చేశాం

రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వాలు ఆలోచించలేదు

భూముల, స్థిరాస్తుల యాజమానులకు హక్కు పత్రాలు ఇవ్వబోతున్నాం

నవంబర్‌లో 1500లకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం

హద్దులు సరిచేసి హక్కు పత్రాలు అందజేస్తాం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం గ్రామాల్లోనే ఉండేలా అడుగులు వేస్తున్నాం

పేదవాడి బాగోగులను పట్టించుకునే ప్రభుత్వం మనది

మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం వాగ్దాలను నెరవేర్చాం

గ్రామాల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం మనది

వాలంటీర్‌ వ్యవస్థతో నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు

ఆర్బీకేల్లో విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు సేవలు

అవనిగడ్డ నియోజకవర్గంలో 15, 791 ఎకాలు, 10,019 మంది రైతన్నలకు ప్రయోజనం

రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం

గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేరుస్తూ 2016లో జీవో ఇచ్చింది

ఆ భూములను డీనోటిఫై చేసి రైతన్నలకు మేలు చేశాం

చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి రైతులకు మేలు చేశాం

రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలన్నింటికీ పరిష్కారం

దేశానికి ఆదర్శంగా ఉండేలా రిజిస్ట్రేషన్‌, రికార్డుల నిర్వహణ

మన పాలన, గత ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలి

వెన్నపోటు దారులంతా ఎవరికీ మంచి చేయలేదు

దుష్ట చతుష్టయం మన ప్రభుత్వంపై యుద్ధం చేస్తారట

ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతుంటే ఆశ్చర్యమేస్తోంది

ఇది మంచికి మోసానికి జరుగుతున్న యుద్ధం

పేదవానికి పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం

మనం ఎవరికీ అన్యాయం చేయలేదు

మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబితే..కాదు మూడు పెళ్లిళ్లు వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు

మీరు చేసుకోండి.. అని ఏకంగా టీవీల్లో చెబుతున్నారు

అలా అందరూ మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే వ్యవస్థ ఏం బతుకుతుంది

ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి?

ఇలాంటి నాయకులా మనకు దిశ దశ చూపేది?

దుష్టచతుష్టయంగా ఏర్పడి కలిసి కూటములు కడతారు

వాళ్ల మాదిరిగా నేను కుట్రలు, మీడియాను నమ్ముకోలేదు

నేను దేవుడిని నమ్ముకున్నా.. అక్కా చెల్లెమ్మలను నమ్ముకున్నా

(The above story first appeared on LatestLY on Oct 20, 2022 01:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).