Avanigadda, Oct 20: ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగింది. 22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు సీఎం జగన్ అందజేశారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ప్రసంగించారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగే రైతులకు భూపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగించారు.
సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా భూములకు కచ్చితమైన రికార్డులు లేవు
రికార్డుల్లో వివరాలు పక్కాగా లేకపోవడంతో ఇబ్బందులు
వంద ఏళ్ల తర్వాత మహాయజ్ఞంలా భూసర్వే చేస్తున్నాం
15వేల మంది సర్వేయర్లను రిక్రూట్ చేశాం
అత్యాధునిక పరికరాలను భూ సర్వేకు ఉపయోగిస్తున్నాం
విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నాం
భూముల రీసర్వేతో రికార్టులను అప్‌డేట్ చేస్తున్నాం
చుక్కల భూములని, అనాధీన భూములని ఇటువంటి నిషేధిత జాబితాలో ఉన్న భూములకు పరిష్కారం చేశాం
రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వాలు ఆలోచించలేదు
భూముల, స్థిరాస్తుల యాజమానులకు హక్కు పత్రాలు ఇవ్వబోతున్నాం
నవంబర్‌లో 1500లకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం
హద్దులు సరిచేసి హక్కు పత్రాలు అందజేస్తాం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గ్రామాల్లోనే ఉండేలా అడుగులు వేస్తున్నాం
మంత్రి ధర్మాన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
35 వేల ఎకరాలు రైతులదేనని సీఎం జగన్ చెప్పారు
భూములపై సీఎం జగన్ అన్ని హక్కులు కల్పించారు
భూమి రైతన్నకు ఒక సెంటిమెంట్
రైతన్నకు ఒక హోదాను సీఎం జగన్ కల్పించారు
35 వేల ఎకరాలను గడిచిన ప్రభుత్వం సర్కారు భూమి అని పెట్టింది
ప్రభుత్వ భూమి కాదు.. 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతాంగానిదే భూమి అని సీఎం జగన్ ఆర్డర్ ఇచ్చారు
గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలి
రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొస్తాం