Delhi, January 1: కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ. 1350కే 50 కిలోల డీఏపీ బస్తా అందివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
అలాగే పీఎం ఫసల్ బీమా యోజన పథకం నిధులను రూ.69,515 కోట్లకు పెంచారు. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు రూ. 824.77 కోట్ల కార్పస్ ఫండ్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోసారి విదేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ఆస్ట్రేలియా- సింగపూర్‌లో పర్యటించనున్న సీఎం బృందం..క్రీడా ప్రాంగణాలు పరిశీలన
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది.అలాగే దేశవ్యాప్తంగా పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.