WhatsApp Governance in Andhra Pradesh: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం, తొలి దశలో 161 సర్వీసులు అందుబాటులోకి, వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా సేవలు పొందవచ్చు

161 పౌర-కేంద్రీకృత సేవలను అందించే వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ మన మిత్రను ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం ఇక్కడ ప్రారంభించారు. పత్రాల సేకరణ కోసం అనేకసార్లు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం నుండి ఈ సర్వీస్ (WhatsApp governance Programme) ప్రజలను రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

WhatsApp Governance in Andhra Pradesh: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం, తొలి దశలో 161 సర్వీసులు అందుబాటులోకి, వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా సేవలు పొందవచ్చు
Nara Lokesh (photo/TDP)

Vjy, Jan 30:  161 పౌర-కేంద్రీకృత సేవలను అందించే వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ మన మిత్రను ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం ఇక్కడ ప్రారంభించారు. పత్రాల సేకరణ కోసం అనేకసార్లు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం నుండి ఈ సర్వీస్ (WhatsApp governance Programme) ప్రజలను రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం, వారికి అవసరమైన సమాచాన్ని అందించడం, వారికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేయడం వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp Governance) ద్వారా అందుతాయి. దీనికోసం వాట్సాప్ నంబర్ 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యథాతథంగా మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఐటీ శాఖ మంత్రి ఈ సేవలను ప్రారంభించారు. ఎండోమెంట్స్, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్లు, CM రిలీఫ్ ఫండ్ (CMRF) మరియు మున్సిపల్ శాఖలకు సంబంధించిన సేవలు మొదటి దశలో అందించబడతాయి. రెండవ దశలో మరిన్ని సేవలు అందించబడతాయి.

"ఇది చారిత్రాత్మక క్షణం అని మేము నమ్ముతున్నాము. ప్రాథమిక పత్రాలను పొందడానికి వారు (ప్రజలు) ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకు రావాలి లేదా ఎమ్మెల్యేను ఎందుకు కలవాలని తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ. తన పాదయాత్ర రోజుల నుంచి ఇలాంటి సేవను అందించాలనే ఆలోచన తనకు ఉందని ఐటీ మంత్రి తెలిపారు. ఈమేరకు బుధవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చొరవపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

WhatsApp Governance in Andhra Pradesh:

ఈ సేవలను పొందే వ్యక్తులు తమ ఆప్షన్‌లను ఎలా ఎంచుకుంటారో అధికారులు సీఎంకు వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రోగ్రామ్‌లో మొదటి దశలో 161 సేవలు అందజేస్తుండగా, రెండో దశలో 360 సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు లోకేశ్ తెలిపారు. మొత్తంగా, భవిష్యత్తులో దాదాపు 520 సేవలను ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని, ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 22, 2024న, WhatsApp ద్వారా సేవలను విస్తరించడానికి రాష్ట్రం Metaతో ఒప్పందం చేసుకుంది.

WhatsApp Governance in Andhra Pradesh:

వాట్సాప్ ద్వారా ఏ సమాచారాన్నయినా సందేశాల ద్వారా ప్రజలకు పంపిస్తారు. వర్షాలు, వరదలు, విద్యుత్తు, వైద్యారోగ్యం, సబ్ స్టేషన్ల మరమ్మతులు, పర్యాటకం, మౌలిక వసతులు తదితర సమాచారం అందిస్తారు. వివిధ శాఖలకు సంబంధించిన పలు సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, ల్యాండ్ రికార్డుల వంటి సర్టిఫికెట్లు పొందవచ్చు. ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు వంటివి వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు.

వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకునే వారు.... వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ టైప్ చేసి... వినతి ఏమిటో టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నంబర్ ద్వారా వినతి పరిష్కారం ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నింటి గురించి ఈ వాట్సప్‌ నంబరుకు మెసేజ్‌ చేసి, తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్‌లో పంపిస్తారు. మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని.. టికెట్లు, వసతి సహా అన్నీ బుక్‌ చేసుకోవచ్చు.

ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్‌.. ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్‌ ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి చేసిన దరఖాస్తుల స్టేటస్‌ తెలుసుకోవచ్చు. విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్‌ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్‌ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్‌ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్‌ సర్వీసు, సర్వీసు, రిఫండ్, ఫీడ్‌బ్యాక్‌ తదితర సేవలు దీని ద్వారా పొందవచ్చు.

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 03:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).