AP Shocker: విశాఖలో డ్రమ్ములో ముక్కలు ముక్కలుగా నరికిన యువతి మృతదేహం, భర్తే నరికి డ్రమ్ములో దాచిపెట్టాడనే అనుమానాలు, ఏడాది తర్వాత దారుణ ఘటన వెలుగులోకి..

ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ అనే యువతి హత్య ఘటన మరువక ముందే ఏపీలో శాఖపట్నం జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైజాగ్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లోని డ్రమ్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం (Woman's Body Found Chopped Up) లభ్యమైంది.

AP Shocker: విశాఖలో డ్రమ్ములో ముక్కలు ముక్కలుగా నరికిన యువతి మృతదేహం, భర్తే నరికి డ్రమ్ములో దాచిపెట్టాడనే అనుమానాలు, ఏడాది తర్వాత దారుణ ఘటన వెలుగులోకి..
Man Kills Son To Hide Affairrepresentational purpose only | (Photo Credits: PTI)

Vizag, Dec 5: ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ అనే యువతి హత్య ఘటన మరువక ముందే ఏపీలో శాఖపట్నం జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైజాగ్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లోని డ్రమ్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం (Woman's Body Found Chopped Up) లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కూపీ లాగగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ వికలాంగుల కాలనీలో గల కొండపై ఓ ఇంట్లో నివసిస్తున్న కుటుంబం నివిసిస్తూ ఉండేది. కొంతకాలంగా వారి ఆచూకీ ఆ చుట్టు పక్కల వారికి కనిపించలేదు. పైగా ఆ ప్రాంతంలో కూలి పనులు చేసుకునే వారే అధికం. అద్దెకు ఉంటున్న వ్యక్తి భార్య గర్భవతి కావడంతో సరిగా ఆ ఇంట్లో ఉండటం లేదని చెబుతున్నారు.

యూపీలో షాకింగ్ ఘటన, యజమానితో పందెంలో ఓడిపోవడంతో శీలాన్ని అమ్మేసుకున్న మహిళ,లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన ఆమె భర్త

దాదాపు ఏడాదిగా ఇంటికి తాళం వేసి ఉంది. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంలో స్థానికులు ఇంటి యాజమానికి సమాచారం అందించారు.యజమాని వచ్చి తాళం పగలగొట్టి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడే ఉన్న ప్లాస్టిక్‌ డ్రమ్మును కదిపాడు. అందులో నుంచి దుర్వాసన రావడంతో మరికొంత బయటకు తీసి చూడగా మహిళ మృతదేహం ఉన్నట్టు గుర్తించి భయాందోళనకు గురయ్యాడు.

షాకింగ్ న్యూస్, రైల్వే స్టేషన్లో ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు, అనంతరం తను గొంతు కోసుకుని ఆత్మాహత్యాయత్నం, యూపీలొ విషాద ఘటన

వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. విశాఖ నార్త్‌ ఏసీపీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం ఉన్న పరిస్థితిని గమనిస్తే.. ఏడాదిన్నర క్రితమే మహిళను హత్య చేసి (Stored In Drum For Over A Year)ముక్కలుగా నరికినట్లు పోలీసులు భావిస్తున్నారు. మహిళను భర్తే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

(The above story first appeared on LatestLY on Dec 06, 2022 10:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).