Lucknow, Dec 5: యూపీలో ఓ మహిళ లూడో జూద వ్యసనంతో (Woman Addicted to Ludo) తనను తాను కుదువపెట్టుకుంది. లూడో గేమ్ పందెంలో యజమాని చేతిలో ఓడిపోవడంతొ ఆమె (Uttar Pradesh Woman) అతనితోనే ఉండిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్‌లోని కొత్వాలి నగర్ దేవ్ కలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి రేణు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఆరు నెలల క్రితం భర్త పనికోసం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాడు.
అక్కడే ఇటుకలు తయారు చేసే కార్మికుడిగా పని చేస్తున్నాడు. అక్కడి నుంచి భార్యకు నిత్యం డబ్బులు పంపేవాడు. భర్త ఇచ్చిన డబ్బుతో వివాహిత తన ఇంటి యజమానితో రోజూ ఆన్‌లైన్ గేమ్ లూడోకు ఆడేది. అలా మెల్లమెల్లగా ఆమె ఆ ఆటకు బానిసగా మారిపోయింది. అలా ఓ రోజు ఇద్దరి కలిసి ఆడుతూ పందెం వేసుకున్నారు. ఈ క్రమంలో మహిళ తన వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోవడంతో ఏం చేయాలో తెలియక యజమానికి (Starts Living with Landlord ) తనను తాకట్టు పెట్టి మరీ లూడో ఆడింది.
తనపై తానే పందెం కాసిన ఈ ఆటలోనూ మహిళ ఓడిపోవడంతో చివరికి యజమాని దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో షాక్‌కు గురైన ఆమె భర్త ప్రతాప్‌గఢ్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నిత్యం జూదం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతుండేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బెట్టింగ్‌లో ఓడిపోవడంతో తన భార్య ఇప్పుడు ఇంటి యజమానితో కలిసి జీవిస్తోందని తెలిపాడు. అతన్ని విడిచిపెట్టి రావాలని కోరగా.. అందుకు ఆమె ఒప్పుకోవడం లేదని వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.