AP Cabinet Meeting: ముగిసిన ఏపీ క్యాబినెట్‌ సమావేశం, పలు కీలక అంశాలకు ఆమోదం, పులివెందుల, కొత్తపేట రెవెన్యూ డివిజన్లకు , వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి ఆమోదం

ఏపీ క్యాబినెట్‌ సమావేశం ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో (AP Cabinet Meeting) పలు కీలక అంశాలకు క్యాబినెట్‌ ఆమోదం ముద్ర వేసింది. ఏపీ మిల్లెట్‌ మిషన్ ‌2022-23 నుంచి 2026-27 పాలసీకి ఆమోదం (AP Cabinet approves several key decisions) తెలిపింది.

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ క్యాబినెట్‌ సమావేశం, పలు కీలక అంశాలకు ఆమోదం, పులివెందుల, కొత్తపేట రెవెన్యూ డివిజన్లకు , వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి ఆమోదం

Amaravati, April 7: ఏపీ క్యాబినెట్‌ సమావేశం ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో (AP Cabinet Meeting) పలు కీలక అంశాలకు క్యాబినెట్‌ ఆమోదం ముద్ర వేసింది. ఏపీ మిల్లెట్‌ మిషన్ ‌2022-23 నుంచి 2026-27 పాలసీకి ఆమోదం (AP Cabinet approves several key decisions) తెలిపింది. విద్య, వైద్య, ప్రణాళిక శాఖల్లో నియామకాలకు ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో పులివెందుల, కొత్తపేట రెవెన్యూ డివిజన్లకు , వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి కేబినెట్‌ ఆమోదించింది.

డిగ్రీ కళాశాలల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ, డిగ్రీ కళాశాలల్లో 574 పోస్టుల భర్తీ, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌, ఏపీ టూరిజం కార్పొరేషన్‌కు 6 ఎకరాలు ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు క్యాబినెట్‌ సమావేశం ఆమోద ముద్ర వేసింది . రాజమహేంద్రవరంలో హోటల్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు స్థల ప్రతిపాదన, ఐదు జిల్లాలో ఆస్పత్రుల నిర్మాణానికి భూ కేటాయింపుల ప్రతిపాదన, హెల్త్‌ హబ్‌ పథకం కింద ఆస్పత్రుల నిర్మాణానికి భూ కేటాయింపులు, రాజమహేంద్రవరం , కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆస్పత్రులు , అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో హెల్త్‌ హబ్‌ పథకం కింద ఆస్పత్రులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

ఏపీలో మూకుమ్మడిగా 24 మంది మంత్రుల రాజీనామా, ఏపీ సీఎం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపిన కొడాలి నాని, ఏప్రిల్‌ 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం

కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో పారిశ్రామిక పార్కుకు 82 ఎకరాల కేటాయింపు ,జడ్పీల కాలపరిమితి ముగిసే వరకు కొనసాగించేందుకు చట్ట సవరణల నిర్ణయంపై కూడా మంత్రివర్గంలో చర్చించారు.  జిల్లాల పునర్విభజనలో భాగంగా 12 పోలీస్‌ సబ్‌ డివిజన్లు, 16 పోలీస్‌ సర్కిళ్ల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జిల్లా పరిషత్‌ల కాల పరిమితి, రిజర్వేషన్లు కొనసాగిస్తూ కేబినెట్‌ తీర్మానించింది.

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో కొత్తగా 12 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ తీర్మానించింది. ఇందులో 7 టీచింగ్‌ పోస్టులు, 5 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఒక అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ను, రెండు ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మంత్రిగా తనకు అవకాశాలు తక్కువని తెలిపిన కొడాలి నాని, అయిదారుగురు మంత్రులు కేబినెట్‌లో కొనసాగే అవకాశం, ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి

ఉన్నత విద్యాశాఖకోసం 253 పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్‌ తీర్మానం. ఇందులో 23 ప్రిన్సిపల్‌, 31 టీచింగ్‌ పోస్టులు, 139 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల లో 82 ఎకరాలు, నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు కోసం 84 ఎకరాల కేటాయింపు. ప్రభుత్వ వైద్యులు ఎవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధించే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 పోస్టుల భర్తీకి, ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్‌, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

(The above story first appeared on LatestLY on Apr 07, 2022 06:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).