APTIDCO Row: ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊరట, టిడ్కో ఇళ్ల లబ్దిదారుల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీకి హైకోర్టు నిరాకరణ, తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా
ఏపీ విశాఖ జిల్లా అనకాపల్లి మునిసిపాలిటీ పరిధిలో టిడ్కో (Andhra Pradesh Township and Infrastructure Development Corporation) ఇళ్ల లబ్దిదారుల జాబితా నుంచి 904 మందిని తొలగించడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Amaravati, Dec 29: ఏపీ విశాఖ జిల్లా అనకాపల్లి మునిసిపాలిటీ పరిధిలో టిడ్కో (Andhra Pradesh Township and Infrastructure Development Corporation) ఇళ్ల లబ్దిదారుల జాబితా నుంచి 904 మందిని తొలగించడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
టిడ్కో (APTIDCO) ఇళ్ల లబ్దిదారుల జాబితా నుంచి 904 మందిని తొలగించారని, పాత జాబితా ప్రకారమే కేటాయింపులు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఇళ్ల కేటాయింపులపై తదుపరి చర్యలన్నీ నిలిపేయాలంటూ అనకాపల్లికి చెందిన దొడ్డి వీఎస్ జగదీశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంపై ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది సుమన్ హైకోర్టుకు వాదనలు వినిపించారు. 904 మందిని తొలగించడానికి గల కారణాలను కోర్టుకు తెలిపారు. గతంలో పలువురు ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు పొందారని, మరికొందరు అసలు టిడ్కో ఇళ్లు పొందేందుకు ఏ మాత్రం అర్హులు కారని, ఇలా పలు కారణాలతో తొలగించారని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 5కు వాయిదా వేసింది.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జరగనున్న టిడ్కో రిజిస్ట్రేషన్ల విషయంలో పక్కాగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్లను పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఆదేశించారు.
(The above story first appeared on LatestLY on Dec 29, 2020 11:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

