Andhra Pradesh: బాబాయి చెవి ఊడేలా కొరికిన అబ్బాయ్! కుటుంబ తగాదాల్లో విచక్షణారహితంగా దాడి, చెవి కొరకడంతో సగం ఊడి వచ్చిన చెవి, సగం చెవితో ఆస్పత్రికి పరుగులు పెట్టిన వ్యక్తి

ఓ బాలుడు తన బాబాయి చెవిని కొరికేశాడు. అది మామూలుగా కూడా కాదు, పంటిగాట్లు పడేట్లు కూడా కాదు, ఏకంగా చెవి ఊడిపోయి ఇవతలకు వచ్చేసింది. బాపట్ల జిల్లా (Bpatla) కొల్లూరు గ్రామంలో ఒక కుటుంబంలో తల్లికి చిన్నకొడుక్కి మధ్య మొదలైన వాగ్వాదం పెద్ద గొడవకు దారితీసింది. ఈ విషయాన్ని ఆమె తన పెద్ద కొడుక్కి చెప్పింది

Andhra Pradesh: బాబాయి చెవి ఊడేలా కొరికిన అబ్బాయ్! కుటుంబ తగాదాల్లో విచక్షణారహితంగా దాడి, చెవి కొరకడంతో సగం ఊడి వచ్చిన చెవి, సగం చెవితో ఆస్పత్రికి పరుగులు పెట్టిన వ్యక్తి

Baptla, July 31:  కుటుంబ తగాదాల్లో తలలు పగులగొట్టుకోవడం తెలుసు. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోవడం తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో కుటుంబ తగాదాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సభ్యులు విచక్షణారహితంగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు తన బాబాయి చెవిని కొరికేశాడు. అది మామూలుగా కూడా కాదు, పంటిగాట్లు పడేట్లు కూడా కాదు, ఏకంగా చెవి ఊడిపోయి ఇవతలకు వచ్చేసింది. బాపట్ల జిల్లా  (Bpatla) కొల్లూరు గ్రామంలో ఒక కుటుంబంలో తల్లికి చిన్నకొడుక్కి మధ్య మొదలైన వాగ్వాదం పెద్ద గొడవకు దారితీసింది. ఈ విషయాన్ని ఆమె తన పెద్ద కొడుక్కి చెప్పింది. దీంతో అన్న వచ్చి  తల్లితో గొడవపడిన విషయమై  తమ్ముడిని మందలించాడు. అది భరించలేని తమ్ముడు కోపంతో ఊగిపోతూ అన్నను కొట్టాడు.

Indian Navy: విశాఖ బీచ్‌లో గల్లంతై నెల్లూరులో ప్రియుడితో ప్రత్యక్షమైన సాయిప్రియ వ్యవహారంపై ఇండియన్ నేవీ సీరియస్, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విశాఖ పోలీసులకు ఫిర్యాదు..  

ఈ క్రమంలో ఇంట్లో అందరూ కలిసి వారిద్దరూ కొట్టుకోకుండా ఆపేందుకు చిన్న కొడుకును గట్టిగా పట్టుకున్నారు. ఇంతలో అన్న కొడుకు  వచ్చి బాబాయ్ (uncle)చెవి  కొరికాడు. అలా కొరికే క్రమంలో చెవి శరీరం నుంచి విడిపోయి బయటకు  వచ్చేసింది. దీంతో లబోదిబోమంటూ ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఊడిపడిన సగం చెవితో ఆ వ్యక్తిని  తెనాలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

AP Shocker: భార్యపై పదే పదే అనుమానం, తట్టుకోలేక రోకలి బండతో తలపై కొట్టి చంపిన భార్య, కృష్ణా జిల్లాలో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు  

అక్కడ వైద్యులు  ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం బాధితుడిని గుంటూరు ప్రభుత్వ  వైద్యశాలకు తరలించారు. ఈఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 31, 2022 09:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).