Vijayawada Dancer Suicide Case: విజయవాడలో డ్యాన్సర్ ఆత్మహత్య, కేసులో కొత్త ట్విస్టు అదేనా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఏపీలో విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో ఈవెంట్ డ్యాన్సర్ (Suspicious Death in Vijayawada) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో డాన్సర్ గాయత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Dancer suspicious death) పాల్పడింది. కాగా ఆమె ఆత్మహత్యకు ముందు నీలిమ అనే యువతి ఇంటి కొచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఇంట్లో వివాదం జరిగినట్లు సమాచారం. నీలిమ వెళ్లిపోయిన తర్వాత గాయత్రి.. ఇంట్లో చీరతో ఉరివేసుకుంది.
Amaravati, Dec 19: ఏపీలో విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో ఈవెంట్ డ్యాన్సర్ (Suspicious Death in Vijayawada) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో డాన్సర్ గాయత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Dancer suspicious death) పాల్పడింది. కాగా ఆమె ఆత్మహత్యకు ముందు నీలిమ అనే యువతి ఇంటి కొచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఇంట్లో వివాదం జరిగినట్లు సమాచారం. నీలిమ వెళ్లిపోయిన తర్వాత గాయత్రి.. ఇంట్లో చీరతో ఉరివేసుకుంది.
ఆ సమయంలో పిల్లలతో కలిసి గాయత్రి భర్త సతీష్ బయటకు వెళ్లారు. గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రితో గొడవ పడిన నీలిమాని పోలీసులు విచారిస్తున్నారు. డ్యాన్సర్ గాయత్రి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈవెంట్ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు గాయత్రి ఇంటికి నీలిమ అనే యువతి వచ్చివెళ్లిన విషయం తెలిసిందే. అయితే నీలిమ భర్త బన్నీతో గాయత్రికి అక్రమ సంబంధం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని సమాచారం. తాజాగా తన భర్తతో వివాహేతర సంబంధంపై గాయత్రితో నీలిమ గొడవ పడిందని తెలుస్తోంది.
మనస్తాపం చెందిన గాయత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వార్తలు అందుతున్నాయి. కాగా గాయత్రి ఇంటికి తాను వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే ఆమెతో ఘర్షణ పడలేదని నీలిమ తెలిపింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో పోలీసులే తేల్చాలని నీలిమ వ్యాఖ్యానించింది
(The above story first appeared on LatestLY on Dec 19, 2020 06:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

