Visakhapatnam, Dec 18: ఆంధ్ర ప్రదేశ్ కార్వనిర్వాహక రాజధానిగా తయారుకాబోతున్న విశాఖపట్నం జిల్లాలోని విశాఖ ఉక్కులో విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం (Fire at Vizag Steel Plant) చోటు చేసుకుంది. ఎస్ఎంఎస్-2లో ద్రవ ఉక్కుతో ఉన్న లాడిల్ జారిపడటంతో అది నేలపై పడిపోయింది. ఉక్కు పడిన చోట ఆయిల్ ఉండటంతో ఒక్కసారిగా మంటలు (Fire accident in Vizag steel plant) ఎగిసిపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న నలుగురి సిబ్బందికి గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే సుమారు కోటి రూపాయుల ఉక్కుద్రావణం నేల పాలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. గాయాల పాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా నవంబర్ 5న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో (Visakhapatnam Steel Plant) అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే. టర్బన్ ఆయిల్ లీక్ కావడంతో స్టీల్‌ప్లాంట్ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు (Vizag Steel Plant Fire Accident) చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్ మోటర్లు దగ్ధం కావడంతో సుమారు రూ.2కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని వార్తలు వచ్చాయి. ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ యూనిట్లలో మంటలు చెలరేగాయి.
టర్బన్ ఆయిల్ లీక్ కావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రొడక్షన్ యూనిట్‌లో ఉక్కును కరిగించడానికి వినియోగించే టర్బన్ ఆయిల్ లీక్ కావడం వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
టర్బన్ ఆయిల్‌పై నిప్పు రవ్వలు పడటంతో వెంటనే మంటలు చెలరేగాయని అంటున్నారు. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించినట్లు చెబుతున్నారు. 1.2 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల మోటార్లు ఈ మంటల బారిన పడ్డాయని సమాచారం. వినియోగించడానికి వీల్లేకుండా కాలిపోయాయని తెలుస్తోంది. ఈ మోటార్ల విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే ప్రొడక్షన్‌ను నిలిపివేశారు.
ఏపీలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 69,062కరోనా పరీక్షలు నిర్వహించగా, 458 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి గుంటూరు వాసి మృతిచెందారు. ఇప్పటివరకు కరోనాతో 7070 మంది మృతిచెందారు.
ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 534 మంది కోవిడ్‌నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటి వరకు 1,11,34,359 శాంపిల్స్‌ను పరీక్షించారు.