Gudivada Development Row: గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరిన కొడాలి నాని, నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్

గుడివాడ అభివృద్ధిపై ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గుడివాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీలేదన్నారు. గుడివాడలో 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నాం.

Gudivada Development Row: గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరిన కొడాలి నాని, నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్
Kodali Nani (photo-Twitter)

Gudivada, April 13: గుడివాడ అభివృద్ధిపై ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గుడివాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీలేదన్నారు. గుడివాడలో 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం’’ అంటూ సవాల్‌ విసిరారు.రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్‌ అవుతాయన్నారు.

చంద్రబాబు 14 ఏళ్లు గుడివాడను గాలికి వదిలేశారు. ఇప్పుడు సిగ్గులేకుండా వచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం గుడివాడలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గుడివాడకు చంద్రబాబు ఏం చేశారు? గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయింది. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపించగలరా?. చంద్రబాబు నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు జిత్తులమారి నక్క’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు.

బామ్మర్ధులను తడిగుడ్డలతో గొంతకోసిన సైకో చంద్రబాబు, బందరులో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడిన పేర్ని నాని

సభలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చారు. ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలు కూడా చంద్రబాబు పెట్టలేదు. మేము పెట్టిన విగ్రహలకు చంద్రబాబు దండలు వేశారు. హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు నిమ్మకూరును అభివృద్ధి చేశారు. హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉన్న చిత్తుశుద్ధి చంద్రబాబుకు లేదు. నిమ్మకూరును ఉద్దరించామని చెబితే ఎవరు నమ్ముతారు?’’ అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు.

(The above story first appeared on LatestLY on Apr 14, 2023 02:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).