Heavy Rains Alert: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రానున్న రెండు రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ విభాగం
తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48గంటల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారనున్నది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు (Rain In Andhra Pradesh) కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని (Heavy Rains Alert) వాతావరణశాఖ తెలిపింది. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
Amaravati, June 10: తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48గంటల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారనున్నది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు (Rain In Andhra Pradesh) కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని (Heavy Rains Alert) వాతావరణశాఖ తెలిపింది. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఏపీలో నాలుగు వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు, తాజాగా 147 కరోనా కేసులు నమోదు, 2403 మంది డిశ్చార్జ్
బుధ, గురువారాల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం అల్పపీడనంగా బలపడింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయి ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాగల 36 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉంది’ అని ఐఎండీ పేర్కొంది. లాడ్జీలో కోరిక తీర్చాలంటూ ఎస్ఐ ఒత్తిడి, బాధితుల ఫిర్యాదుతో సస్పెన్షన్‌కు గురైన అమరావతి ఎస్ఐ, విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిఎస్‌పి ఆదేశాలు
కాగా నైరుతి రుతు పవనాలు రాబోయే 36 గంటల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కోస్తాంధ్రలో ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు, రేపు రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
గుంటూరు జిల్లాలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులకు చెట్లు విరిగి పడి విద్యుత్ తీగలు తెగటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుంటూరులో భారీ వర్షం కురవటంతో ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. గత 24 గంటల్లో విశాఖపట్నంలో 5 సెంమీ, ఎస్.కోట, అనకాపల్లి, అరకు, వేపాడలో 4 సెం.మీ, చోడవరం, భీమిలిలో 3 సెంమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
(The above story first appeared on LatestLY on Jun 10, 2020 11:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

