Amaravati, June 9: ఏపీలో (Andhra Pradesh) గడిచిన 24 గంటల్లో 15,085 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 147 మందికి పాజిటివ్‌గా నిర్దారణ (AP Coronavirus) అయింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 16 మంది డిశ్చార్జ్ కాగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరణించిన ఆ ఇద్దరు కృష్ణా, అనంతపురం జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 3990 కరోనా కేసులు నమోదు కాగా 2403 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు 77 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1510 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా కల్లోలం, రికార్డు స్థాయిలో కొత్తగా 9,987 కొత్త కేసులు, 2,66,598కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య
దేశంలో కరోనా వైరస్ కల్లోలం (India Coronavirus) కొనసాగుతూనే ఉంది. కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర ఇప్పటికే చైనాను దాటేసింది. గడచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 9,987 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 2,66,598కు పెరిగింది. మహమ్మారి బారినపడి 24 గంటల్లో మరో 331మంది చనిపోయారు. దీంతో కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య 7,466కు (Coronavirus Deaths) చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,29,917 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 1,29,215 మంది కోలుకున్నారు. వరుసగా ఏడోరోజూ 9వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.