New Delhi, June 9: దేశంలో కరోనా వైరస్ కల్లోలం (India Coronavirus) కొనసాగుతూనే ఉంది. కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర ఇప్పటికే చైనాను దాటేసింది. గడచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 9,987 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 2,66,598కు పెరిగింది. హోం క్వారంటైన్‌లోకి ఢిల్లీ సీఎం, జ్వరం,గొంతు నొప్పితో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్
మహమ్మారి బారినపడి 24 గంటల్లో మరో 331మంది చనిపోయారు. దీంతో కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య 7,466కు (Coronavirus Deaths) చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,29,917 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 1,29,215 మంది కోలుకున్నారు. వరుసగా ఏడోరోజూ 9వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా 1562 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో కరోనా తాకిడికి గురైనవారి సంఖ్య 33,229కు పెరిగింది. తాజా వైద్య పరీక్షలలోనూ చెన్నై వాసులకే అధికంగా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. చెన్నైలో ఒకే రోజు 1149 మందికి పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నమోదైన 1562 పాజిటివ్ కేసులలో 1520 కేసులు రాష్ట్రానికి చెందినవి .
తక్కిన 42 కేసుల్లో ఖతార్, కువైట్ (12 కేసులు) మహారాష్ట్ర (22) ఢిల్లీ (6) హర్యానాకు చెందిన వారున్నారు. చెన్నైలో సోమవారం ఒకే రోజు 1149 మందికి కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో నగరంలో కరోనా కేసుల సంఖ్య 23298 కు చేరింది.డిశ్చార్జి అయినవారి సంఖ్య 17,527కు పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనా తాకిడికి గురై చికిత్స ఫలించక మృతి చెందినవారి సంఖ్య 286కు చేరింది.