New Delhi, June 8: దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు (Coronavirus Test) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరినీ కలవకుండా ఢిల్లీలోని తన నివాసంలోనే కొన్ని రోజులు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో అన్నీ ఓపెన్, తాజాగా 125 కోవిడ్ 19 కేసులు, జ్వరం,దగ్గు లక్షణాలుంటే వెంటనే 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు
ఈ రోజు మధ్యాహ్నం, రేపు ఆయన పాల్గొనాల్సి ఉన్న అన్ని సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కాగా, ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న విషయం తెలిసిందే.
ఆదివారం ఆయన ఆన్‌లైన్ మీడియా బ్రీఫింగ్‌కు హాజరయ్యారు. ఆ విలేకరుల సమావేశం తరువాత ఢిల్లీ సిఎం బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. యూనియన్ భూభాగం యొక్క అన్ని సరిహద్దులను తెరవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, అన్ని రెస్టారెంట్, మాల్స్ మరియు ప్రార్థనా స్థలాలు సోమవారం నుండి ప్రారంభమవుతాయని ప్రెస్ మీట్లో కేజ్రీవాల్ ప్రకటించారు. దేశ రాజధానిలోని యుటి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఢిల్లీ రోగులకు మాత్రమే చికిత్స చేస్తాయని ఆయన అన్నారు. చైనాను దాటేసిన మహారాష్ట్ర, దేశ వ్యాప్తంగా 7 వేలమందికి పైగా మరణం, ఇండియాలో 2,56,611కి చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య
ఢిల్లీలో కరోనావైరస్ (Delhi Coronavirus) కేసులు 29,000 మార్కును దాటాయి. జాతీయ రాజధానిలో మరణించిన వారి సంఖ్య సోమవారం 812 కు పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం 17,000 కి పైగా క్రియాశీల COVID-19 కేసులు ఉన్నాయి. 11,000 మందికి పైగా వైరస్ నుండి కోలుకున్నారు.