COVID-19 In India (Photo-PTI)

Amaravati, june 8: ఏపీలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు 14,246 మందికి పరీక్షలు నిర్వహించగా 125 మందికి కరోనా పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య (COVID-19 Cases) 4813కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇందులో 838 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉండగా, 132 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మృతి, 70 లక్షలు దాటేసిన కోవిడ్-19 కేసులు, కేసుల వివరాలను ఇక వెల్లడించమని తెలిపిన బ్రెజిల్

కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న 34 మందిని తాజాగా డిశ్చార్జి చేయడంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2387కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1381 గా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో ఎవరూ చనిపోలేదు. రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ మరణాల సంఖ్య 75. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 4,68,276 మందికి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు.

రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా మిగిలిన చోట్ల సోమవారం నుంచి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నగరంలో మాల్స్‌,రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. కోవిడ్ నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మాల్స్, రెస్టారెంట్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లకు ప్రవేశద్వారం వద్ద సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ తో పాటు శానిటైజేషన్‌ చేస్తున్నారు. చైనాను దాటేసిన మహారాష్ట్ర, దేశ వ్యాప్తంగా 7 వేలమందికి పైగా మరణం, ఇండియాలో 2,56,611కి చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య

హోటల్ లో పని చేసే సిబ్బంది ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్, గ్లౌజులు వేసుకోవాలని, టేబుల్‌కు టేబుల్‌కు మధ్య దూరం ఉండే విధంగా చూడటం వంటి నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది.

రాష్ట్రంలో 80రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి దేవాలయాలు తెరుచుకున్నాయి. ఉ.6 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి.