New Delhi, June 8: దేశంలో కరోనావైరస్ (Coronavirus Outbreak) తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది. వరుసగా ఆరో రోజూ తొమ్మిది వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9983 పాజిటివ్ కేసులు నమోదవడంతోపాటు, 206 మంది (COVId-9 Deaths in India) మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,56,611కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,24,095 మంది బాధితులు కోలుకోగా, మరో 1,25,381 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్ వల్ల 7135 మంది మరణించారు. దావూద్ ఇబ్రాహీంకు కరోనా పాజిటివ్, అతని భార్యకు కూడా కోవిడ్ 19 పాజిటివ్, క్వారంటైన్‌లో దావూద్ పర్సనల్ స్టాఫ్, వార్తలను ఖండిస్తున్న పాక్ ప్రభుత్వం
మహారాష్ట్రలో (Maharashtra) ఆదివారం కొత్తగా 3007 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 85,975 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 31,667 కరోనా కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, 27,654 కేసులతో ఢిల్లీ, 20,700 పాజిటివ్ కేసులతో గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ (9401), పశ్చిమబెంగాల్ (8187), కర్ణాటక (5452), బీహార్ (5088)లో ఐదువేలకు పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే దేశంలో కరోనా హాట్‌స్పాట్ కేంద్రంగా ఉన్న మహారాష్ట్ర వైరస్ కేసుల సంఖ్యలో చైనాను దాటేసింది. చైనాలో (Chin Coronavirus) ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 83,036 ఉండగా మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 85,975కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మూడు వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య కూడా మూడు వేలు దాటింది.