Amaravati, June 10: మహిళలను రక్షించాల్సిన పోలీసు అధికారి తన కర్తవ్యాన్ని మరిచి ఓ మహిళ వద్ద డబ్బు వసూలు చేయడంతో పాటు, లైంగిక దాడికి యత్నించిన ఆరోపణలు రావడం అమరావతిలో (Amaravati) కలకలం రేపింది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సస్పెన్షన్‌కు (Amaravati SI Suspended) గురయ్యారు. పార్లమెంట్‌లో ఈ సారి అరుపులు, మెరుపులు ఉండవు, పరిశీలనలోకి హైబ్రిడ్ విధానం, జూలైలో వర్షాకాల సమావేశాలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం
వివరాలలోకి వెళితే పెదకూరపాడు మండలానికి చెందిన ఓ జంట సోమవారం అమరావతిలోని ఓ లాడ్జిలో దిగింది. సమాచారం అందుకున్న అమరావతి ఎస్‌ఐ రామాంజనేయులు వ్యక్తిగత వాహనంలో డ్రైవర్‌తో కలిసి లాడ్జికి చేరుకుని వారిని పట్టుకున్నాడు. వ్యభిచారం కేసు నమోదు చేస్తానని వారిని బెదిరించాడు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాము అంత ఇచ్చుకోలేమని, రూ.5 వేలు ఇవ్వగలమని చెప్పి తమ వద్ద ఉన్న రూ.3 వేలు ఎస్సైకి ఇచ్చారు. మిగతా రూ.2 వేల కోసం యువకుడిని ఎస్‌ఐ ఎటిఎంకు పంపాడు.
అతడికి తోడుగా తన డ్రైవర్‌ను కూడా పంపిన ఎస్‌ఐ వారు వెళ్లగానే ఒంటరిగా ఉన్న మహిళను లైంగికంగా (Sexual Harassment) వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించాడు. ఎటిఎం నుంచి యువకుడు వచ్చిన తర్వాత వారి నుంచి వివరాలు తీసుకుని వదిలిపెట్టాడు. ఎస్‌ఐ తీరుపై బాధితులు మంగళవారం డిఎస్‌పి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఆయన ఈ విషయాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావుకు చేరవేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారి నుంచి లంచం తీసుకున్నట్లు తేలడంతో రామాంజనేయులను సస్పెండ్ చేస్తూ ఐజి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్‌ఐ పైనా, అతడి డ్రైవర్ పైనా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.