Virtual Parliament: పార్లమెంట్‌లో ఈ సారి అరుపులు, మెరుపులు ఉండవు, పరిశీలనలోకి హైబ్రిడ్‌ విధానం, జూలైలో వర్షాకాల సమావేశాలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం
PM Narendra Modi in Lok Sabha (Photo Credits: ANI)

New Delhi, June 10: దేశవ్యాప్తంగా పంజా విసురుతున్న కోవిడ్-19 ప్రభావం (Covid-19 pandemic) పార్లమెంటు సమావేశాలపై పడింది. గతంలో లాగా వర్షాకాల సమావేశాల నిర్వహణ (Monsoon session) సాధ్యం కాదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla), రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు (Rajya Sabha chairman Venkaiah Naidu) ఇరు సభల సెక్రటరీ జనరల్స్‌ స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో సమావేశ మందిరాల్లో సభ్యులందరికీ సీట్లు కేటాయించలేమన్నారు. కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటిస్తూ సీట్లకు కేటాయించినా సరిపోవని తెలిపారు. పుట్టినరోజే కరోనాతో ఎమ్మెల్యే మృతి, కోవిడ్-19 కేసుల్లో వూహాన్ నగరాన్ని మించిపోయిన ముంబై, దేశ వ్యాప్తంగా 2 లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు

మొత్తం ఎంపీలకు పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో, విజ్ఞానభవన్‌ ప్లీనరీ హాల్‌లో సీట్లు కేటాయించగలిగేంత స్థలం లేదన్నారు. కాగా భౌతిక దూరం పాటిస్తూ సీట్లను ఏర్పాటు చేస్తే రాజ్యసభ సమావేశ మందిరంలో 60 మందికే కూర్చునే అవకాశం లభిస్తుందని, సెంట్రల్‌హాల్‌లో 100 మందికే కూర్చునే వీలుంటుందని తెలిపారు.అలాగే గ్యాలరీల్లోనూ కూర్చునేలా ఏర్పాట్లు చేసినా అందరు ఎంపీలకు అవకాశం కల్పించలేమన్నారు.

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా వర్చువల్‌ (Virtual Parliament) విధానంలోనో, లేదా హైబ్రిడ్‌ విధానంలోనో సమావేశాల నిర్వహణ సాధ్యమవుతుందా? అనే విషయాన్ని ఓం బిర్లా, వెంకయ్య పరిశీలించారు. కొందరు సభ్యులు ప్రత్యక్షంగా సమావేశాలకు హాజరైతే మిగతావారు వీడియో లింక్‌ ద్వారా వర్చువల్‌గా సభా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే హైబ్రిడ్‌ విధానం. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఏ రోజు ఏ ఎంపీ భాగస్వామ్యం ప్రత్యక్షంగా అవసరమో, వారినే సభలోనికి అనుమతించి, మిగతా వారు ఆన్‌లైన్‌లో (online participation) సభాకార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలను వర్చువల్‌గానో, హైబ్రిడ్‌ విధానంలోనో నిర్వహించడానికి సంబంధించి అన్ని సాంకేతిక అంశాలను పరిశీలించాలని సెక్రటరీ జనరల్స్‌ను ఇరు సభల అధ్యక్షులు ఆదేశించారు.

అలాగే లోక్ సభలో రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని తెలియవచ్చింది. ఒక రోజు లోక్ సభ సమావేశాలు జరిగితే.. మరో రోజు రాజ్యసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.