డిజిటల్ చెల్లింపు సేవల యాప్ పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ జొమాటోతో భారీ డీల్ కుదుర్చుకుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు వన్97 కమ్యూనికేషన్స్ బుధవారం ప్రకటించింది. ఫోన్ నెంబర్లు బ్లాక్ అవుతాయంటూ వచ్చే కాల్స్ నమ్మవద్దు, వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసిన ట్రాయ్
పేటీఎం యాప్‌లో అందుబాటులో ఉండే మూవీస్, స్పోర్ట్స్, ప్రముఖ ఈవెంట్ల టికెట్ బుకింగ్ సేవల వ్యాపారం త్వరలో జొమాటో చేతుల్లోకి వెళ్లనుంది. టికెటింగ్ సేవల బదిలీకి 12 నెలల వరకు సమయం పట్టవచ్చని వన్97 వెల్లడించింది. ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారం ద్వారా పేటీఎంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.297 కోట్ల ఆదాయం, రూ.29 కోట్ల స్థూల లాభం సమకూరింది.