Kakinada Shocker: మా అమ్మను నాన్న ఇలా గొంతు నొక్కి చంపాడు, కాకినాడ వివాహిత హత్యకేసులో తండ్రే హంతకుడని కూతురు వాంగ్మూలం, బిడ్డ నల్లగా పుట్టిందని అనుమానంతోనే చంపినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ, మూర్చవచ్చి చనిపోయిందని నమ్మించేయత్నం

ఆమె మెడపై కమిలినట్లు గుర్తులు కనిపించడంతో ఆసుపత్రి సిబ్బంది కాకినాడ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిర్వహించి, దహన సంస్కారాలు పూర్తిచేశారు. లిపికా తల్లిదండ్రులు మంగళవారం కాకినాడ వెళ్లి, చిన్నారిని తమతో కారాగావ్‌ (Karagav) తీసుకొచ్చారు.

Kakinada, SEP 25: కూతురు నల్లగా పుట్టిందని భార్యపై అనుమానం పెంచుకున్న వ్యక్తి...చివరికి ఆ అనుమానంతోనే ఆమెను చంపేశాడు. పైగా మూర్చవచ్చి చనిపోయిందని కట్టుకథ అల్లి కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ వచ్చీ రానీ మాటలతో రెండున్నరేళ్ల చిన్నారి చెప్పిన నిజం విని అంతా షాక్ అయ్యారు. మా నాన్నే...అమ్మను గొంతు ఇలా నొక్కి చంపాడంటూ తన తాతయ్యకు చిన్నారి చెప్పడంతో పోలీసులకు (Police) ఫిర్యాదు చేశాడు.  అప్పటి దాకా తన కుమార్తె మూర్ఛ వచ్చి చనిపోయిందని అనుకున్నారాయన. తన కుమార్తెను అల్లుడే హతమార్చాడని మనవరాలి మాటల ద్వారా అర్థమైంది. చిన్నారిని తీసుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారాయన. పుట్టిన బిడ్డ నల్లగా ఉందని అనుమానం పెంచుకున్న భర్త... భార్యను చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Fire Accident: రేణిగుంటలో అగ్నిప్రమాదం.. వైద్యుడి సజీవదహనం.. మరో ఇద్దరి చిన్నారుల పరిస్థితి.. 

పోలీసుల కథనం ప్రకారం... ఒడిశాలోని (Odisha) ఉమ్మర్‌కోట్‌ (Umerkote) సమితి సిలాటిగావ్‌ గ్రామానికి చెందిన మాణిక్‌ ఘోష్‌కు (Manijk Ghosh) కారాగావ్‌ గ్రామానికి చెందిన లిపికా మండల్‌(Lipika Mandal)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయ్యాక వారిద్దరూ ఉపాధి కోసం ఏపీలోని కాకినాడకు (Kakinada) వలస వెళ్లారు. రెండున్నరేళ్ల కిందట వారికి మహి జన్మించింది. ఆ చిన్నారి నల్లగా ఉందని లిపికాపై మాణిక్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలయ్యాయి. ఈ ఏడాది మొదట్లో మరోసారి గొడవ జరగడంతో లిపికా పుట్టింటికి వచ్చేశారు. జూన్‌లో అత్తింటివారు కారాగావ్‌ వెళ్లి లిపికాకు సర్దిచెప్పి కాకినాడ పంపారు. ఈ నెల 18న రాత్రి లిపికాకు మూర్ఛ రాగా, మాణిక్‌ స్నేహితుల సహకారంతో అంబులెన్సులో ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Hit and Run Case in Hyderabad: ర్యాష్ డ్రైవింగ్‌కు డాక్టర్ బలి, హైదరాబాద్‌లో డాక్టర్‌ను కారుతో ఢీకొట్టి పారిపోయిన యువకుడు, నిమ్స్ లో మూడు రోజుల పాటూ మృత్యువుతో పోరాటం, తలకు బలమైన గాయం కారణంగా మృతి 

ఆమె మెడపై కమిలినట్లు గుర్తులు కనిపించడంతో ఆసుపత్రి సిబ్బంది కాకినాడ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిర్వహించి, దహన సంస్కారాలు పూర్తిచేశారు. లిపికా తల్లిదండ్రులు మంగళవారం కాకినాడ వెళ్లి, చిన్నారిని తమతో కారాగావ్‌ (Karagav) తీసుకొచ్చారు.

తల్లి ఎలా చనిపోయిందో, తండ్రి ఏం చేశాడో ఆ చిన్నారి... తాత తపన్‌ మండల్‌కు వివరించింది. ఆయన శనివారం చిన్నారితో కలిసి ఉమ్మర్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ బాలిక జరిగిన విషయాన్ని పోలీసులకూ తెలిపింది. ఈ మేరకు వారు కాకినాడ పోలీసులకు సమాచారం అందించగా నిందితుడిని అరెస్టు చేశారు.

(The above story first appeared on LatestLY on Sep 25, 2022 04:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).