Representational Image (Photo Credits: Twitter)

Hyderabad, SEP 24: మలక్‌ పేట హిట్ అండ్ రన్ (Hit and Run ) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న డాక్టర్ శ్రావణి చనిపోయింది. నిమ్స్ లో (NIIMS) మూడురోజుల నుంచి ప్రాణాలతో పోరాడుతున్న డాక్టర్ శ్రావణి (Doctor Sravani) శనివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. 25 రోజుల కిందటే వాళ్ల అమ్మ గుండెపోటుతో మరణించగా.. ఇప్పుడు శ్రావణి కూడా ఇలా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. హస్తినాపురం (Hasthinapuram) డెంటల్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న శ్రావణి ఈ నెల 21న స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. ఓ కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రావణి కింద పడిపోగా.. కారుతో సహా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Injection Fear: ఇంజెక్షన్ ఇస్తారేమో అని భయపడి ఆటోలో నుంచి దూకిన యువకుడు, ఖమ్మం జిల్లా ప్రజల్ని వెంటాడుతున్న ఇంజెక్షన్ మర్ధర్ భయం, ఆటోలో వెళ్తుండగా..పక్కనున్న వ్యక్తి సంచిలో చేయిపెట్టగానే కిందకు దూకిన వ్యక్తి 

తీవ్రంగా గాయపడ్డ శ్రావణిని నిమ్స్ లో చేర్పించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు.  ఆమె తలకు బలమైన గాయం కావడంతోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు.

Khammam Horror: రోడ్డుపై ముక్కూ, ముఖం తెలియని వారు లిఫ్ట్ అడగ్గానే.. ఇస్తున్నారా? అయితే, ఈ స్టోరీ మీకోసమే.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ తో పొడిచి చంపేశాడు! ఖమ్మంలో దారుణ ఘటన 

ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ (CCTV) ఆధారంగా కారును గుర్తించారు. నిందితుడు ఓల్డ్ మలక్ పేటకు చెందిన 19ఏళ్ళ ఇబ్రహీంగా గుర్తించామన్నారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడికి లైసెన్స్, కారుకి పేపర్లు కూడా లేవని పోలీసులు తెలిపారు.