Accident in AP: విహారయాత్రలో విషాదం.. తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం.. కారు కాల్వలో పడి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

విహారయాత్రలో ఆనందంగా గడిపి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు విద్యార్థులను ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Accident in AP: విహారయాత్రలో విషాదం.. తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం.. కారు కాల్వలో పడి ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
Credits: Twitter

Vijayawada, Aug 6: విహారయాత్రలో ఆనందంగా గడిపి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు విద్యార్థులను ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. తూర్పుగోదావరి (East Godavari)  జిల్లాలో ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల్లో (Engineering Students) ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  ఏలూరు (Eluru) సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థులు రెండు కార్లలో నిన్న విహారయాత్రకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లి గడిపారు. రాత్రి తిరిగి బయలుదేరారు.

Ileana: మాతృమూర్తి అయిన ఇలియానా.. కుమారుడి పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అని వెల్లడి.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షల సందేశాలు

తిరిగివస్తుండగా..

ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి సమీపంలో ఓ కారు అదుపుతప్పి పాత, కొత్త వంతెనల మధ్యనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఉదయ్‌కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Earthquake in Delhi: ఢిల్లీలో కంపించిన భూమి.. ఆఫ్ఘనిస్థాన్ హిందూకుష్ పర్వత ప్రాంతంలో భూకంపం.. హస్తినలో ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో ప్రకంపనలు

 

(The above story first appeared on LatestLY on Aug 06, 2023 10:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).