Newdelhi, Aug 6: దేశ రాజధాని ఢిల్లీతో (Delhi) పాటు పరిసర ప్రాంతాల్లో భూమి (Earth) కంపించినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో (Hindukush) శనివారం సాయంత్రం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మనీ రీసెర్చ్ సెంటర్ (Germany Research Centre) ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. భూకంప కేంద్రం 181 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం) సహా పలు ప్రాంతాలపై పడింది. దీంతో ఇక్కడ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జమ్ము కాశ్మీర్‌లోను 5.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Chandrayaan 3 Mission Update: కీలకమైలురాయి దాటిన చంద్రయాన్-3, భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన చంద్రయాన్-3, ఆగస్ట్ 24 న ల్యాండింగ్ అయ్యే అవకాశం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)