Guntur Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి, విజయవాడ వైపు వెళ్తన్న కారును ఢీకొట్టిన కంటైనర్ లారీ

గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Guntur Road Accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. విజయవాడవైపు వెళ్తన్న కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను అత్తులూరి బలరాం(25), ఫిరో అహ్మద్‌(35), వింజమూరి హరికృష్ణ(26), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Guntur Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి, విజయవాడ వైపు వెళ్తన్న కారును ఢీకొట్టిన కంటైనర్ లారీ
Road accident at Naguluppalapadu in Prakasam 9-daily-labours-has-dead-in-andhra-pradesh (Picture Credits: ANI)

Amaravati, July 2: గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Guntur Road Accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. విజయవాడవైపు వెళ్తన్న కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను అత్తులూరి బలరాం(25), ఫిరో అహ్మద్‌(35), వింజమూరి హరికృష్ణ(26), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించండి, రాష్ట్రపతి, సీజేఐలకు లేఖ రాసిన హన్స్‌రాజ్‌, కోవిడ్ పరిస్థితులు ఎదుర్కోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణ

నలుగురు యువకులు గుంటూరు జిల్లా (Guntur) నరసరావుపేట నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే తిమ్మాపురం దగ్గర రోడ్డు ప్రమాదం (Road Accident In Guntur) జరిగింది. మృతులు రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామానికి చెందిన అత్తులూరి బలరాం(26) నరసరావుపేటలోని పనసతోటకు చెందిన షేక్‌ ఫిరోజ్‌ అహ్మద్‌(35), శ్రీనివాస్‌ నగర్‌కు చెందిన వింజమూరి హరికృష్ణ (27), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.

(The above story first appeared on LatestLY on Jul 02, 2020 12:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).