Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వీడియోతో
కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డివైడర్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
Tuni, March 19: కాకినాడ (Kakinada) జిల్లా తుని (Tuni) జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు (RTC Bus) బోల్తా పడింది. డివైడర్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రయాణికులను హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి (Hospital) తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. విజయవాడ నుంచి పార్వతిపురం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.. డ్రైవర్ నిద్ర, మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా#NTVNews #NTVTelugu #AndhraPradesh #Accident https://t.co/5PF5cYTalH
— NTV Telugu (@NtvTeluguLive) March 19, 2023
మద్యం మత్తులో బస్సును నడుపుతున్న డ్రైవర్.. అతివేగంతో.. డివైడర్‌ను ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి.. బోల్తాకొట్టి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు కూడా అంతా నిద్ర మత్తులో ఉన్నారని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Mar 19, 2023 11:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

