Credits: Twitter (Representational)

Hyderabad, March 19: తెలంగాణలో (Telangana) ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు ఉంటాయని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో 4,94,616 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని... 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఈ నెల 24 నుంచి వెబ్ సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కాగా, అన్ని పరీక్షలకు 3 గంటల సమయం ఇవ్వగా, సైన్స్ పరీక్షకు 3.20 గంటలు కేటాయించారు. ఈసారి తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షలకు 6 పేపర్లు అన్న విషయం తెలిసిందే.