Newdelhi, March 19: పెరు (Peru), ఈక్వెడార్‌లను(Ecuador) నిన్న భారీ భూకంపం (Ecuador) కుదిపేసింది. 6.8 తీవ్రతతో వచ్చిన ఈ శక్తిమంతమైన భూకంపం కారణంగా భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈక్వెడార్‌లోని మాచల, క్యుయెంకా తదితర నగరాల్లో ఎక్కడ చూసినా శిథిలాలు (Debris) దర్శనమిస్తున్నాయి. భూకంపంతో వణికిపోయిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి రోడ్లపై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
12 Killed After 6.8 Magnitude Earthquake Strikes Ecuador, Peru https://t.co/21v497daXL pic.twitter.com/wuOwG61dzg
— NDTV News feed (@ndtvfeed) March 19, 2023
ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కొనసాగుతోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. 12.12 గంటలకు దాదాపు 41 మైళ్ల (66 కిలోమీటర్ల) లోతున ఈ భూకంపం సంభవించినట్టు పేర్కొంది. కాగా, భూకంప తీవ్రత 7.0గా ఉన్నట్టు తొలుత పెరు సీస్మోలాజికల్ అధికారులు తెలిపారు. అయితే, కొన్ని గంటల తర్వాత తీవ్రతను 6.7గా పేర్కొన్నారు.